పాతాళ భైరవి (Patala bharavi 1951)

పాతాళ భైరవి తెలుగులో వచ్చిన గొప్ప ఫాంటసీ సినిమా. విజయావారు షావుకారు సినిమా అనంతారం ఏదైనా ఊహాజనిత సినిమా తీయాలనుకొన్నారు. దీనికి మధిర సుబ్బన్నదీక్షితుల వారి కాశీమజీలీ కథలను, అల్లాద్ధీన్ కథలను ప్రేరణగా తీసుకొని మద్యప్రదేశ్ లోని ఉజ్జయిని పట్టణా నేపద్యంగా పాతాళభైరవి సినిమాకు రచన చేసారు పింగళివారు. 1951 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రంగా నిలిచింది ఈ సినిమా. యన్.టి.ఆర్ యుక్తవయస్సు, ప్రతిభ, నేపాళ మాంత్రికుని గా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము, కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు దీనిని చరిత్ర లో చిరస్థాయిగా నిలిపాయి. అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకొన్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది.

సినిమాలో అప్పట్లో మంచి డైలాగులు బాగా ప్రముఖంగా వినిపించేవి.
సాహసం సాయరా డింభకా రాకుమారి దక్కునురా
మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా
జనం అడిగింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?
జై పాతాళ భైరవి, సాష్తాంగ నమస్కారం సేయరా డింభకా

d56d6b4299871e3cc6123b5cbeb2d525pathala_bhairavi
కథలోకెళితే

ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు రామారావు ఇఅతడి పేరు తోటరాముడు.  సాహస కార్యాలంటే ఆసక్తి ఉన్న యువకుడు. అతని సహాయకుడు అంజిగాడు.
రాజకుమార్తె ఇందుమతి (మాలతి) అప్పుడప్పుడూ ఆ ఉద్యానవనానికి వస్తూ ఉంటుంది. తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతిని చూసి ప్రేమలో పడతాడు రాముడు. రాణిగారి తమ్ముడి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదిరించడం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసుపడుతుంది. ఆమెను పెళ్లాడాలంటే మహారాజు కొన్ని షరతులు విధిస్తాడు. తనతో స్మాన హోదా డబ్బు సంపాదించమనంటాడు. కోరిన విధంగా సర్వ సంపదలు సాధించడానికి నేపాళ మాంత్రికుని ఆశ్రయిస్తాడు రాముడు. ఆ మాంత్రికుని సూచనల మేరకు పలు సాహసాలు చేస్తాడు. అయితే తోటరాముడిని బలి ఇచ్చి పాతాళభైరవి (గిరిజ) అనుగ్రహాన్ని పొందాలని, అందువలన తన శక్తికి ఎదురు ఉండదని, మాంత్రికుని అసలు ప్రణాళిక. ఇది తెలుసుకొన్న తోటరాముడు అదునుచూసుకొని మాంత్రికుడిని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందుతాడు. తన శక్తులతో భవంతులు, ధనం, సైన్యం అన్నీ కల్పించి వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు.

మాంత్రికుని శిష్యుడు సదాజప మూలికల సహాయంతో తన గురువుగారిని బ్రతికించుకొంటాడు. ఇంతలో ఉజ్జయినిలో రాజుగారి బావమరది (రేలంగి) పాతాళభైరవి శక్తిని మాంత్రికునికి అందజేస్తాడు. మాంత్రికుని మాయవలన ఒక్కమారుగా తోటరాముని సంపద మాయమైపోతుంది. మాంత్రికుడు వంచనతో పెళ్లి పీటలపైనున్న రాకుమారిని మాయం చేస్తాడు. మళ్ళీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవడానికి మాంత్రికుని గుహకు వెళ్ళి అతన్ని వధించి ఉజ్జయిని రాకుమారిని వివాహం చేసుకుంటాడు.

చిత్ర ఇతర విశేషాలు

మొదట్లో ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును గాని రాజారెడ్డిని గాని హీరోగా, గోవిందరాజుల సుబ్బారావును కానీ, ముక్కామలను కానీ ప్రతినాయకుడిగా పెడదామనుకున్నారు. కాని సంసారం సినిమా చిత్రీకరణలో రామారావును చూసిన దర్శకుడు కె.వి. రెడ్డి తమ చిత్ర కథలోని నాయకపాత్రకు ఎన్టీయారే తగినవాడని ఆయనను ఎంచుకోవడం జరిగింది.

అదే విధంగా భక్తపోతన సినిమాలో మాలతి నటనకు మెచ్చి ఆమెను ఇందుమతి పాత్రకు తీసుకొన్నారు.

1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం పాతాళ భైరవే.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా చిత్రం ఇదే. తెలుగులో 1951 మార్చి 15న విడుదలైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది.

1980లలో హీరో కృష్ణ సారథ్యంలోని పద్మాలయా సంస్థ జితేంద్ర హీరోగా ఇదే సినిమాను మళ్ళీ హిందీలో, కలర్ లో తీశారు.

నటీనటులు
నందమూరి తారకరామారావు … తోటరాముడు
ఎస్.వి. రంగారావు … నేపాళ మాంత్రికుడు
కె.మాలతి … ఇందుమతి
చిలకలపూడి సీతారామాంజనేయులు … రాజు
గిరిజ … పాతాళ భైరవి
బాలకృష్ణ … అంజి
సురభి కమలాబాయి
లక్ష్మీకాంతం
బి. పద్మనాభం … డింగిరి
హేమలతమ్మ
రేలంగి …. రాజుగారి బావమరది
సావిత్రి … నర్తకి (రానంటే రానే పాటలో)

పాటలు- రచన-పాడినవారు
తియ్యని ఊహలు  – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     పి.లీల
ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షణమో – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల, పి.లీల
కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖినీ  – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల
కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే -పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల, పి.లీల
ప్రణయ జీవులకు దేవి వరాలే కానుకలివియే   – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల, పి.లీల
ఇతిహాసం వినరా     పింగళి నాగేంద్రరావు  –  ఘంటసాల     కమలా చంద్రబాబు
ప్రేమకోసం వలలో పడెనే పాపం పసివాడు  – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     వి.జె. వర్మ
వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు –  పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     జిక్కి
తాళలేనే నే తాళలేనే –  పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     రేలంగి
హాయిగా మనమింకా స్వేచ్ఛగా  – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల, పి.లీల
రానంటే రానే రాను – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     పిఠాపురం నాగేశ్వరరావు, టి.కె. సావిత్రి
వినవే బాలా నా ప్రేమ గోలా -పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     రేలంగి

పాటలు వినడానికి, డౌన్‌లోడ్ చేసుకోడానికి
http://doregama.info/pathala-bhairavi-1951.html

సినిమా ఇక్కడ చూడండి

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s