పాతాళ భైరవి (Patala bharavi 1951)

పాతాళ భైరవి తెలుగులో వచ్చిన గొప్ప ఫాంటసీ సినిమా. విజయావారు షావుకారు సినిమా అనంతారం ఏదైనా ఊహాజనిత సినిమా తీయాలనుకొన్నారు. దీనికి మధిర సుబ్బన్నదీక్షితుల వారి కాశీమజీలీ కథలను, అల్లాద్ధీన్ కథలను ప్రేరణగా తీసుకొని మద్యప్రదేశ్ లోని ఉజ్జయిని పట్టణా నేపద్యంగా పాతాళభైరవి సినిమాకు రచన చేసారు పింగళివారు. 1951 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రంగా నిలిచింది ఈ సినిమా. యన్.టి.ఆర్ యుక్తవయస్సు, ప్రతిభ, నేపాళ మాంత్రికుని గా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము, కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు దీనిని చరిత్ర లో చిరస్థాయిగా నిలిపాయి. అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకొన్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది.

సినిమాలో అప్పట్లో మంచి డైలాగులు బాగా ప్రముఖంగా వినిపించేవి.
సాహసం సాయరా డింభకా రాకుమారి దక్కునురా
మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా
జనం అడిగింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?
జై పాతాళ భైరవి, సాష్తాంగ నమస్కారం సేయరా డింభకా

d56d6b4299871e3cc6123b5cbeb2d525pathala_bhairavi
కథలోకెళితే

ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు రామారావు ఇఅతడి పేరు తోటరాముడు.  సాహస కార్యాలంటే ఆసక్తి ఉన్న యువకుడు. అతని సహాయకుడు అంజిగాడు.
రాజకుమార్తె ఇందుమతి (మాలతి) అప్పుడప్పుడూ ఆ ఉద్యానవనానికి వస్తూ ఉంటుంది. తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతిని చూసి ప్రేమలో పడతాడు రాముడు. రాణిగారి తమ్ముడి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదిరించడం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసుపడుతుంది. ఆమెను పెళ్లాడాలంటే మహారాజు కొన్ని షరతులు విధిస్తాడు. తనతో స్మాన హోదా డబ్బు సంపాదించమనంటాడు. కోరిన విధంగా సర్వ సంపదలు సాధించడానికి నేపాళ మాంత్రికుని ఆశ్రయిస్తాడు రాముడు. ఆ మాంత్రికుని సూచనల మేరకు పలు సాహసాలు చేస్తాడు. అయితే తోటరాముడిని బలి ఇచ్చి పాతాళభైరవి (గిరిజ) అనుగ్రహాన్ని పొందాలని, అందువలన తన శక్తికి ఎదురు ఉండదని, మాంత్రికుని అసలు ప్రణాళిక. ఇది తెలుసుకొన్న తోటరాముడు అదునుచూసుకొని మాంత్రికుడిని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందుతాడు. తన శక్తులతో భవంతులు, ధనం, సైన్యం అన్నీ కల్పించి వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు.

మాంత్రికుని శిష్యుడు సదాజప మూలికల సహాయంతో తన గురువుగారిని బ్రతికించుకొంటాడు. ఇంతలో ఉజ్జయినిలో రాజుగారి బావమరది (రేలంగి) పాతాళభైరవి శక్తిని మాంత్రికునికి అందజేస్తాడు. మాంత్రికుని మాయవలన ఒక్కమారుగా తోటరాముని సంపద మాయమైపోతుంది. మాంత్రికుడు వంచనతో పెళ్లి పీటలపైనున్న రాకుమారిని మాయం చేస్తాడు. మళ్ళీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవడానికి మాంత్రికుని గుహకు వెళ్ళి అతన్ని వధించి ఉజ్జయిని రాకుమారిని వివాహం చేసుకుంటాడు.

చిత్ర ఇతర విశేషాలు

మొదట్లో ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావును గాని రాజారెడ్డిని గాని హీరోగా, గోవిందరాజుల సుబ్బారావును కానీ, ముక్కామలను కానీ ప్రతినాయకుడిగా పెడదామనుకున్నారు. కాని సంసారం సినిమా చిత్రీకరణలో రామారావును చూసిన దర్శకుడు కె.వి. రెడ్డి తమ చిత్ర కథలోని నాయకపాత్రకు ఎన్టీయారే తగినవాడని ఆయనను ఎంచుకోవడం జరిగింది.

అదే విధంగా భక్తపోతన సినిమాలో మాలతి నటనకు మెచ్చి ఆమెను ఇందుమతి పాత్రకు తీసుకొన్నారు.

1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం పాతాళ భైరవే.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా చిత్రం ఇదే. తెలుగులో 1951 మార్చి 15న విడుదలైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది.

1980లలో హీరో కృష్ణ సారథ్యంలోని పద్మాలయా సంస్థ జితేంద్ర హీరోగా ఇదే సినిమాను మళ్ళీ హిందీలో, కలర్ లో తీశారు.

నటీనటులు
నందమూరి తారకరామారావు … తోటరాముడు
ఎస్.వి. రంగారావు … నేపాళ మాంత్రికుడు
కె.మాలతి … ఇందుమతి
చిలకలపూడి సీతారామాంజనేయులు … రాజు
గిరిజ … పాతాళ భైరవి
బాలకృష్ణ … అంజి
సురభి కమలాబాయి
లక్ష్మీకాంతం
బి. పద్మనాభం … డింగిరి
హేమలతమ్మ
రేలంగి …. రాజుగారి బావమరది
సావిత్రి … నర్తకి (రానంటే రానే పాటలో)

పాటలు- రచన-పాడినవారు
తియ్యని ఊహలు  – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     పి.లీల
ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షణమో – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల, పి.లీల
కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖినీ  – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల
కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే -పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల, పి.లీల
ప్రణయ జీవులకు దేవి వరాలే కానుకలివియే   – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల, పి.లీల
ఇతిహాసం వినరా     పింగళి నాగేంద్రరావు  –  ఘంటసాల     కమలా చంద్రబాబు
ప్రేమకోసం వలలో పడెనే పాపం పసివాడు  – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     వి.జె. వర్మ
వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు –  పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     జిక్కి
తాళలేనే నే తాళలేనే –  పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     రేలంగి
హాయిగా మనమింకా స్వేచ్ఛగా  – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల, పి.లీల
రానంటే రానే రాను – పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     పిఠాపురం నాగేశ్వరరావు, టి.కె. సావిత్రి
వినవే బాలా నా ప్రేమ గోలా -పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     రేలంగి

పాటలు వినడానికి, డౌన్‌లోడ్ చేసుకోడానికి
http://doregama.info/pathala-bhairavi-1951.html

సినిమా ఇక్కడ చూడండి

ప్రకటనలు

గుండమ్మ కథ (Gundamma katha 1962)

విజయా వారి నుండి వచ్చే అన్ని సినిమాల్లాగే వచ్చిన మరో ఆణి ముత్యం గుండమ్మ కథ. ఇది వారి చివరి విజయవంతమైన నలుపు తెలుపుల చిత్రం. ఆకాలంలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్ అయినా దీనికి ”గుండమ్మ కథ” అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిద్యం.

gundposter

సాంకేతిక విభాగం
దర్శకత్వం     – కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం – బి.నాగిరెడ్డి , చక్రపాణి
రచన      –  పింగళి నాగేంద్రరావు
కథ      –  చక్రపాణి
సంగీతం – ఘంటసాల
గీతరచన     పింగళి నాగేంద్రరావు
సంభాషణలు     డి.వి.నరసరాజు
ఛాయాగ్రహణం     మార్కస్ బార్ట్‌లీ
నిర్మాణ సంస్థ     విజయా ప్రొడక్షన్స్
విడుదల తేదీ     7 జూన్ 1962

తారాగణం  – నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్.వి.రంగారావు, సూర్యకాంతం, ఛాయాదేవి , రమణారెడ్డి , హేమలత ,హరనాథ్ ,ఎల్ విజయలక్ష్మి ,ముక్కామల,ఋష్యేంద్రమణి ,రాజనాల

కథలోకెళితే

గుండమ్మ (సూర్యకాంతం) భర్త చనిపోయిన ఇల్లాలు, ఆమెకు గయ్యాళిగా ఊళ్ళో పేరుంటుంది. ఆమె స్వంత కూతురు సరోజ(జమున), సవతి కూతురు జమున(సావిత్రి). సవతి కూతురును ఒక రకంగా స్వంత కూతురు సరోజను ఒక రకంగా చూస్తుంది. జమునకు ఇంటిలో చాకిరీ మొత్తం చెప్తుంది. పనిపాటలు లేని సరోజ మాత్రం పెంకిగా తయారవుతుంది. సరోజకు గుండమ్మ పెళ్ళిచేయాలని భావించినప్పుడల్లా ఆమె తమ్ముడు గంటయ్య(రమణారెడ్డి) ఆమె గయ్యాళి అనీ, ఆమె కూతురు బద్ధకస్తురాలనీ చెప్పి, చూపించి పెళ్ళి చెడగొడతూంటాడు. ఆమెను ఎలాగైనా హత్యచేసి జైల్లో ఉన్న తన కొడుకు (రాజనాల)కి విడుదలయ్యాకా ఇచ్చి చేయాలనిఅనుకుంటాడు. పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఒక జమీందారు రామభద్రయ్య (ఎస్.వి.రంగారావు) ఇద్దరు కొడుకులకు గుండమ్మ గుండమ్మ కూతురు సంబంధం వస్తుంది. రామభద్రయ్య ఆ ఊరు, తండ్రి పేరు వినగానే ఆయన చనిపోయిన తన స్నేహితుడేనని చెప్పి పెళ్ళి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చి అ యింటి పరిస్థితి అర్ధం చేసుకొంటాడు.

పెద్దకుమార్తె అన్ని విధాలా మంచి గృహిణి అయ్యేదే అయినా ఆమెకు మంచి సంబంధం చేయడం గుండమ్మకు ఇష్టం లేదు, ఏదోక అనాథ, పనివాడు లాంటి బాపతు వ్యక్తికి ఇచ్చిచేసి ఇద్దరినీ ఇంట్లో శాశ్వతంగా పనివాళ్ళను చేసుకోవాలని ఆలోచన. ఇక రెండవ కూతురు పెంకెతనం, బద్ధకం ఉన్నా అవన్నీ తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని పిల్ల మాత్రం మంచిదేనని రామభద్రయ్య నమ్మకం. కానీ ఆమెను కూడా ఎవరైనా ఇల్లరికం వచ్చేవారికి ఇచ్చి చేయాలని ఆశిస్తూంటుంది గుండమ్మ. ఇలా ఇద్దరూ తన కొడుకులకు సరిపోయే పెళ్ళికూతుళ్ళే అయినా గుండమ్మ, ఆమె దగ్గర చేరిన గంటయ్య ఈ పెళ్ళిళ్ళు పడనివ్వరన్న ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్ (ఎన్.టి.రామారావు), రాజా (అక్కినేని నాగేశ్వరరావు)లను పిలిచి పరిస్థితులు వివరిస్తాడు.

వారి పథకం ప్రకారం పెద్దకొడుకు ఆంజనేయప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరతాడు. పొగరున్నా మాంచి పనిమంతుడుగా గుండమ్మను ఆకట్టుకుంటాడు, గంటయ్యని దెబ్బకుదెబ్బ మాటకు మాటతో అదుపుచేస్తూంటాడు. మరోవైపు గుండమ్మ సవతి కూతురు లక్ష్మిని సాటి పనివాడిగా, మంచి మనసున్నవాడిగా ఆకర్షిస్తాడు. గుండమ్మకు ఓ కూతురుతో పాటుగా కొడుకు(హరనాథ్) కూడా ఉంటాడు. అతనూ, ఓ అమ్మాయి(ఎల్.విజయలక్ష్మి)తో ప్రేమించుకుంటూంటారు. ఆమెకు అన్నయ్యగా రామభద్రయ్య రెండో కొడుకు రాజా ప్రవేశించి, గుండమ్మ స్వంతకుమార్తె సరోజను ఆకట్టుకుంటాడు.

సరోజ మంకుపట్టు పట్టడంతో రాజా వివరాలు తెలుసుకుని అతను ఆస్తిపరుడేనని అంజి చెప్పగా గుండమ్మ పెళ్ళికి అంగీకరిస్తుంది. కానీ ఆమెకన్నా పెద్దదైన గుండమ్మ లక్ష్మి పెళ్ళి సంగతి ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది. అదే సమయానికి అంజి తనకు పెళ్ళిచేయకపోతే పనిచేయనని మొండికేస్తాడు. గుండమ్మ లక్ష్మి పెళ్ళి విషయంలో సతమతం కావడం అదనుగా తీసుకుని, “నీకు ఇప్పుడు రెండు సమస్యలు, ఒకటి నా పెళ్ళి, మరోటి బుల్లెమ్మ పెళ్ళి. నాకో పెళ్ళికూతుర్ని తెచ్చి, బుల్లెమ్మకో పెళ్ళికొడుకుని తెచ్చి-తంటాలు ఏం పడతావు కానీ మా ఇద్దరికీ పెళ్ళి చేసెయ్” అని సలహాఇవ్వడంతో పనిచేస్తూండే అనాథ అన్న తనకు కావాల్సిన లక్షణాలు అంజిలో దొరకడంతో అంజికి తన సవతి కూతురిని ఇచ్చి పెళ్ళిచేసేస్తుంది. అలానే తన స్వంత కూతురిని రాజాకు ఇచ్చి చేస్తుంది.

కానీ రాజా దుర్వ్యసనాలకు బానిస అని, దొంగతనాలు చేస్తూంటాడని, అతను చెప్పినట్టు ఆస్తిపరుడూ కాడని కొత్త నాటకం మొదలుపెడతారు. దాంతో గుండమ్మ ఈ వేదన భరించలేకపోతుంది. ఇంతలో రాజా తప్పతాగి అల్లరిచేస్తూంటే అదుపుచేయబోగా సరోజ, గుండమ్మ తిట్టారని కోపగించినట్టు వంకపెట్టి అంజి భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. రాజా కూడా అలిగినట్టు నటించి తన భార్య సరోజను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అంజి సమస్య తీరిపోవడంతో నేరుగా తన బంగ్లాకే తీసుకుపోయి తానెవరో చెప్పేస్తాడు. కానీ భార్య బద్ధకస్తురాలు కావడంతో ఆమెని సరిజేసుకునేందుకు రాజా మాత్రం తమ తోటలోనే ఓ పనివాడిగా తోటలోని ఇంట్లో ఉంటాడు.

ఆమెకు కాయకష్టం చేసుకుని జీవించడంలోని తృప్తి, తన చేత్తో వండిపెట్టడంలోని ఆనందం అనుభవంలోకి తీసుకువస్తాడు. వెన్నెల్లో భర్తతో కలసి తోటలో కష్టపడి అలసిపోవడాన్ని కూడా ఆమె ఇష్టపడడం ప్రారంభిస్తుంది. ఆమెకు ఆర్థిక కష్టాలను, వాటిని కూడా సర్దుకుని ఉన్నంతలో తృప్తిగా జీవించడాన్ని కూడా అలవాటు చేస్తూంటాడు.

మరోవైపు గుండమ్మ కొడుకు తాను ఇష్టపడ్డ అమ్మాయిని గుండమ్మ ఇష్టానికి విలువనివ్వకుండా ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. గుండమ్మ కోడలి కుటుంబసభ్యులు అంతటి గయ్యాళికి కోడలుగా వెళ్తోంది ఎలా నెట్టుకువస్తుందోనని బాధపడుతుంటే వారి దూరపుబంధువు, కొత్త పెళ్ళికూతురికి అత్త వరస అయ్యే దుర్గమ్మ (ఛాయాదేవి) తాను వెళ్ళి గుండమ్మ అంతు తేలుస్తానంటుంది. దుర్గమ్మ వచ్చి గుండమ్మ ఇల్లు దోచేస్తూ, గుండమ్మ మీదే దొంగతనం నేరం వేసి ఆమె కొడుకు, కోడలు ముందు దొంగని చేస్తుంది. గంటయ్య కొడుకు జైలు నుంచి విడుదలై వచ్చి దుర్గమ్మ దొంగసొమ్ములో వాటా కోసం, గుండమ్మపైన ఆమె ఇంట్లోనే రౌడీయిజం చేస్తాడు.

ఇంతలో లక్ష్మి భర్త అంజితో వచ్చి, తాము నిజానికి శ్రీమంతులమని చెప్పడంతో గుండమ్మ సంతోషిస్తుంది. ఇప్పుడు స్వంత ఇంట్లోనే అనాథలా బ్రతుకుతున్నాని చెప్పగా అంజి ఆమె సమస్య తీరుస్తానంటాడు. అతని భార్య దుర్గమ్మతో తలపడి ఆమె నుంచి గుండమ్మ నగలు, డబ్బు లాక్కుని గుండమ్మకే ఇస్తుంది. ఇంతలో ఆమెకు మద్దతుగా ఉన్న రౌడీ రాగా అంజి అతనితో ఫైట్ చేసి ఓడిస్తాడు. మొత్తానికి వారిద్దరూ గుండమ్మ ఇంట్లో సమస్యగా తయారైన గంటయ్య కొడుకుని, దుర్గమ్మనీ తరిమేస్తారు.

మరోవైపు కష్టం విలువ తెలిసిన మనిషిగా, అభిమానవతిగా తయారైన సరోజను ఆమె భర్త గారెలు వండిపెట్టమని కోరి, అందుకు అవసరమైనంత జీతాన్ని యజమాని నుంచి తీసుకునేందుకు పంపుతాడు. యజమానిగా తనను ఒకసారి తన కొడుక్కి చూసుకోవడానికి వచ్చిన రామభద్రయ్యే ఉండడంతో ఇబ్బందిపడుతుంది, అతను డబ్బు ఇవ్వక తనను తన భర్తను అవమానిస్తుంటే తక్షణం అక్కడ ఉండనని బయలుదేరుతుంది. ఇంతలో తన అక్క, ఆమె భర్త అంజి అక్కడ కారులో కనిపించి జరిగినదంతా చెప్తారు.మఆ యజమాని రామభద్రయ్యే తమ మావయ్య అని తెలుస్తుంది. గుండమ్మ కూడా వారింటికి రావడం, అందరిలో ఇల్లరికానికి విరుగుడుగా అల్లుడరికాన్ని తీసుకువస్తానని అంజి చమత్కరించడంతో కథ ముగుస్తుంది.

సినిమా విశేషాలు

జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనె తుంబిద హెణ్ణు పేరిట కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర నిర్మాణానికి విఠలాచార్య నిర్మాత, వాహినీ స్టూడియోస్ అధినేత బి.నాగిరెడ్డి సహకారం పొందారు. ఆ కృతజ్ఞతతో నాగిరెడ్డి అడగగానే సినిమా హక్కుల్ని విఠలాచార్య ఆయనకి ఇచ్చేశారు. మనె తుంబిద హెణ్ణు సినిమాలో గుండమ్మ అనే గయ్యాళికి, నోరుమెదపలేని భర్త ఉంటాడు. ఆమె తన సవతి కూతురుని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేస్తుంది. ఆ విషయం తెలిసిన సవతి కూతురు మేనమామ గుండమ్మపై పగబడతాడు. అతను గుండమ్మ స్వంత కూతురికి నేరాలకు అలవాటుపడ్డ జైలుపక్షికి ఇచ్చి పెళ్ళిజరిగేలా పథకం ప్రకారం చేయిస్తాడు. ఇలా సాగుతుంది ఆ సినిమా. అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ, నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి. దాంతో విజయా ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ రీమేక్ చేసేందుకు సిద్ధపడ్డారు.
కథలో చిన్న చిన్న మార్పులు చేసి డి.వి.నరసరాజుతో ట్రీట్మెంట్, మాటలు రాయించేశారు నాగిరెడ్డి. సినిమాకు దర్శకునిగా నాగిరెడ్డి సోదరుడు బి.ఎన్.రెడ్డిని అనుకున్నారు. అయితే బి.ఎన్.రెడ్డి కళాత్మక చిత్రాల తరహా దర్శకుడు కావడమూ, ఇది ఆయన తరహా సినిమా కాకపోవడంతో పాటు బి.ఎన్.రెడ్డి లాంటి అగ్ర దర్శకుడు ఓ రీమేక్ సినిమా చేస్తే బాగోదన్న అనుమానం రావడంతో నాగిరెడ్డే వేరే దర్శకునితో చేద్దామని నిర్ణయించుకున్నారు. పి.పుల్లయ్య దర్శకత్వం వహిస్తే బావుంటుందని, ఆయనకు నరసరాజు సిద్ధం చేసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపారు. అది చదివిన పుల్లయ్య ఈ కథ, ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు అని ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దాంతో సినిమా నిర్మాణం మళ్ళీ వెనుకబడింది.
ఈ స్క్రిప్ట్ తన సన్నిహితుడు, సహ నిర్మాత, రచయిత అయిన చక్రపాణికి ఇచ్చారు నాగిరెడ్డి. చక్రపాణికి వికలాంగులు, పిచ్చివాళ్ళతో హాస్యం చేస్తూ సీన్లు నడపడం అంతగా నచ్చదు. దాంతో హీరో పిచ్చివాడు కావడమే ప్రధానమైన పాయింట్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ ఆయనకు నచ్చలేదు. కానీ గుండమ్మ కుటుంబ వ్యవహారాలు, ఆ పాత్రలు బాగా నచ్చిన నాగిరెడ్డి మాత్రం ఎలాగైనా సినిమా తీయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. దాంతో చక్రపాణి మొత్తం స్క్రిప్టును తిరగరాసే పనిలో పడ్డారు. విలియం షేక్‌స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ నాటకంలో కథానాయికల పాత్రలను, వారి స్వభావాలను ఆధారం చేసుకుని చక్రపాణి కథను తిరగరాశారు.

సినిమాకు దర్శకునిగా చివరకు కమలాకర కామేశ్వరరావుని ఎంచుకున్నారు నాగిరెడ్డి. తర్వాత చక్రపాణి తిరగరాసిన కథకు ట్రీట్మెంట్, సీనిక్ ఆర్డర్ కోసం కథాచర్చలకు చక్రపాణితో, కమలాకర కామేశ్వరరావు, డి.వి.నరసరాజు కూర్చున్నారు. ఆ చర్చల్లో భాగంగా అప్పటివరకూ ఉన్న గుండమ్మ భర్త పాత్రను తీసేసి గుండమ్మను వైధవ్యం అనుభవిస్తున్నదానిగా చూపిద్దామని నిర్ణయించారు చక్రపాణి. అయితే కళకళలాడుతూ, నగలతో పసుపుకుంకుమలతో గుండమ్మను చూపిద్దామనుకున్న దర్శకుడు కామేశ్వరరావు ఆశాభంగం చెందారు. కానీ చక్రపాణి స్క్రిప్ట్ రచయితగా కథకు ఉపయోగపడని, కథలో మలుపులకు కారణం కాని పాత్ర వ్యర్థమన్న దృష్టితో “పెళ్ళానికి సమాధానం చెప్పలేని వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ పాత్ర మన కథకు అనవసరం” అంటూ తేల్చి, పాత్రను తొలగించేశారు. అయితే మిగతా గుండమ్మ కుటుంబాన్నంతా యధాతథంగా తీసుకున్నారు.
నటీనటుల ఎంపిక

సినిమా కథని చక్రపాణి తిరగరాసిన తర్వాత మాటల రచయిత నరసరాజు, దర్శకుడు కామేశ్వరరావు, స్క్రీన్ ప్లే రచయిత చక్రపాణిల మధ్య జరిగిన కథాచర్చల్లో నటీనటుల ఎంపిక జరిగింది. ఆ చర్చల్లోనే వెంటనే ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తీసుకుందామని నిర్ణయించుకున్నారు. సినిమా అనుకున్ననాడే గుండమ్మ పాత్రకు సూర్యకాంతం అయితేనే సరిపోతారని భావించారు. గుండమ్మ నిజానికి తెలుగుపేరు కాదు కన్నడపేరు. కన్నడంలోని ఈ సినిమా మాతృకలో ఓ పాత్ర పేరు గుండమ్మ. కథను తిరగరాసే క్రమంలో ఆ గుండమ్మ పాత్రను ప్రధానపాత్రగా చేసుకున్నారు. ఆ పాత్రకు ఏ పేరుపెట్టాలా అని తర్జనభర్జనలు పడుతుంటే, మరో పేరు ఎందుకు గుండమ్మ అన్న పేరే పెట్టేద్దామని నిర్ణయించారు చక్రపాణి. అంత కీలకమైన పాత్రకి పెట్టే పేరు తెలుగుపేరు కాకపోవడమా అన్న సందేహాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తే, “ఇందులో ఏముంది, పెడితే అదే తెలుగు పేరు అవుతుంది” అని కొట్టిపారేసి గుండమ్మ అన్న పేరు ఖాయం చేసేశారు.
సినిమాలో నటించిన ఇద్దరు కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు. సినిమా విడుదల సమయంలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందువేయాలి, ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయి. అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి, తర్వాత ఒకేసారి సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఫోటోలు వేశారు.

చిత్రీకరణ

గుండమ్మ కథ సినిమాని విజయా నిర్మాతలకు చెందిన వాహినీ స్టూడియోస్ లో నిర్మించారు. సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా మార్కస్ బార్ట్లే వ్యవహరించారు. చిత్రీకరణలో అవసరమైన సెట్ లను కళాదర్శకులుగా వ్యవహరించిన గోఖలే, కళాధర్ వేశారు. మేకప్ ఎం.పీతాంబరం, టి.పి.భక్తవత్సలం వేశారు. సినిమాలో ముఖ్యపాత్రలు చేసిన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం తదితరులు పరిశ్రమలో చాలా బిజీ ఆర్టిస్టులు. వీళ్ళందరిపై ఒకేసారి షూటింగ్ చేయాలంటే వాళ్ళ డేట్స్ కలిసేవి కాదు. కాల్షీట్ సమస్య వల్ల అలాంటి సన్నివేశాల వరకూ అలా కుదిరిన కొన్ని డేట్లలో తీసి మిగతా సినిమాను వేరే పద్ధతిలో తెరకెక్కించారు. ఏ షాట్, ఎవరెవరి కాంబినేషన్లో షాట్ తీయాలన్నా సమస్య లేకుండా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్నారు. విజయా వారికి చెందిన వాహినీ స్టూడియోలో గుండమ్మ ఇంటి సెట్ వేసివుంచారు. రోజూ ఉదయం చక్రపాణి ఆఫీసుకు వచ్చేసి రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, ఎస్వీఆర్ మొదలై నటులకు ఫోన్ చేసేవారు. ఫోన్లో ఆరోజు వాళ్ళ షెడ్యూల్ ఏంటో కనుక్కునేవారు. ఒకవేళ ఎవరైనా ఈరోజు షూటింగ్ కి వెళ్ళాలి అంటే సరేనని తర్వాతి రెండ్రోజుల సంగతి తెలుసుకుని ఫోన్ పెట్టేసేవారు. మరెవరైనా ఆ రోజు ఖాళీగా ఉన్నానంటే పిలిపించేవారు. వచ్చినవాళ్ళలో స్క్రిప్ట్ ని బట్టి వాళ్ళ మధ్య కాంబినేషన్ సీన్లు చూసుకుని వాళ్ళతో షూటింగ్ చేసేవారు. సినిమాలో “కోలో కోలోయన్న” పాట ఎన్టీఆర్-సావిత్రి, ఏఎన్నార్-జమున జంటలు పక్కపక్కనే ఉండి పాడుకుంటున్నట్టు చూపించారు. కానీ నలుగురు ఒకేసారి కలిసి చేయనేలేదు. ఎవరికి ఎప్పుడు ఖాళీవుంటే వారితో అప్పుడు పాటను తీసేశారు. ఎడిటింగ్ లో ఆ తేడాలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

నిర్మాణానంతర కార్యక్రమాలు

సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీగా ఎ.కృష్ణన్, సౌండ్ ఇంజనీర్ గా వి.శివరాం వ్యవహరించారు. గుండమ్మకథను జి.కళ్యాణసుందరం ఎడిటింగ్ చేయగా ఆయనకు సహాయకునిగా డి.జి.జయరాం వ్యవహరించారు. సినిమా రీల్ ని విజయా లేబొరేటరీస్ లో ప్రాసెస్ చేశారు. సినిమాలో పలు సన్నివేశాల్లో నటించిన నటులంతా లేకున్నా దొరికిన వారితో దొరికినట్టుగా తీసేశారు. దాంతో ఆ తేడా తెలియకుండా ఎడిటింగ్ లో జాగ్రత్తలు తీసుకున్నారు.

గుండమ్మకథ సినిమా జూన్ 7, 1962న రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది.

విమర్శలు

సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయం ఉందనగానే, ఎల్వీ ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్ళివేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్-విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని, జమున పాత్ర చిత్రణ సరిగా లేదని మరికొందరు విమర్శించారు. చివరికి విజయా వారి నిర్మాణంలో మాయాబజార్ సహా పలు చిత్రాలు తీసిన దర్శకుడు కె.వి.రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు. ప్రివ్యూ తర్వాత నరసరాజుకు తన అభిప్రాయాన్ని చెప్తూ-“అదేం కథండీ! కృష్ణా, గుంటూరు జిల్లాల సంపన్న వర్గాల కథలా వుంది. చక్రపాణి గారే రాయగలరు అలాంటి కథలు. మీరు రాసిన డైలాగులు బాగున్నాయనుకోండి. ఒక్క డైలాగులతోనే పిక్చర్ నడుస్తూందా” అన్నారు. సినిమా విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నప్పుడు- విజయా వారి సినిమా, పెద్ద నటీనటులు నటించారు. మొదట్లో హౌస్ ఫుల్ అవుతాయి. పోగాపోగా చూద్దాం అనేవారు. సినిమా ఘన విజయమని స్థిరపడిపోయాకా కూడా ఆయన సమాధాన పడలేదు, ఏంటోనండి. జనం ఎందుకు చూస్తున్నారో అర్థంకావట్లేదు అంటూ గుండమ్మకథ ప్రస్తావన వచ్చినపపుడల్లా అనేవారు.

సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్కపెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవగానే “ఎవరెన్ని అనుకున్నా సినిమా సూపర్ హిట్” అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అప్రతిహత విజయాలను సాధించింది.

సంగీతం -పాటలు

సినిమాకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు. అన్ని పాటలూ పింగళి నాగేంద్రరావు రాశారు. పాటలకు నృత్యదర్శకత్వం పసుమర్తి కృష్ణమూర్తి వహించారు. ఘంటసాల, పి.సుశీల, పి.లీల పాటలు ఆలపించారు.

1, ఎంత హాయి ఈ రేయి, ఎంత మధుర మీ హాయి     (పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల, పి.సుశీల)
2, కోలోకోలో యన్నకోలో నాసామి కోమ్మలిద్దరు మాంచిజోడు     (పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల, పి.సుశీల)
3, ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో     (పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల, పి.సుశీల)
4, మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటిలే     (పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల)
5, లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం     (పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల)
6, వేషము మార్చెనూ భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను     (పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     ఘంటసాల, పి.లీల)
7, సన్నగవీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయె     (పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     పి.సుశీల)
8, అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలూ, రుసరుసలాడే చూపులతోనే ముసిముసి నవ్వుల చందాలూ     (పింగళి నాగేంద్రరావు     ఘంటసాల     పి.సుశీల)

(కొంత సమాచారం వికీనుండి తీసుకొనబడినది)

సినిమా ఈ లింకులో చూడండి –

 

 

మిస్సమ్మ (Missamma – 1955)

movieposter

మిస్సమ్మ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోదగ్గది. మల్టీ స్టారర్ సినిమాల స్వర్ణయుగం అనిపించుకొనే కాలం. నాగిరెడ్డి, చక్రపాణి, ఎల్వీప్రసాద్ వంటి దిగ్గజాల చేతుల్లో సినిమా వర్ధిల్లిన రోజుల్లో వచ్చిన అద్భుత చిత్రరాజం మిస్సమ్మ. ఇది ఒక అద్భుతమైన పూర్తినిడివి హాస్య చిత్రం. ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అతి పెద్ద హీరోలుగా పేరు గాంచిన నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఘన విజయము సాదించిన ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించినది మాత్రము మహానటి సావిత్రి.
ఆమె పాత్రకు రాణింపుగా ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, ఋష్యేంద్రమణి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, బాలక్రిష్ణ, దొరైస్వామి తదితరులు నటించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా అతిధి పాత్రలో కనిపిస్తారు.

ఈ సినిమాకు పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నదగ్గ వాటిలో కొన్ని. ఆయన సాహిత్యమూ, ఎ.ఎం.రాజా, పి.లీల, పి.సుశీల గార్ల గాత్రమాధుర్యమూ కలిసి మిస్సమ్మ సినిమా పాటలను అజరామరం చేసాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికీ తెలుగు వారిని అలరిస్తూ ఉన్నాయి. పి.లీల పాడిన కరుణించు మేరిమాత అనేపాట హృదయాలను తాకుతుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు గొంతు వినిపించని కొద్ది సూపర్‌హిట్‌ తెలుగు సినిమాల్లో ఇది ఒకటి. విప్రనారాయణ, పెళ్ళికానుక కూడా ఈ కోవలోకి వస్తాయి.

ఇక కధలోనికి వెళ్తే

మిస్ మేరీ ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నంలో అదే ఉద్యోగానికి వెళ్తున్న రామారావును బురుడీ కొట్టించడంతో కధ ప్రారంభం అవుతుంది. అక్కడ మనకు నాయకీ, నాయకులు ఎంత తెలివైన వాళ్ళో, గడుసుపిండాలో తెలుస్తుంది. అలా పరిచయం అయిన వాళ్ళు భార్యా భర్తలుగా ఒకే ఉద్యోగానికి వెళ్ళవలసి వస్తే ఎలా ఉంటుంది.

యాభైయేళ్ళ కిందట ఒక పెళ్ళి కాని అమ్మాయి సరిగా పరిచయమైనా కాని ఒక పరాయి మగవాడికి భార్యగా నెలల తరబడి నటించడానికి సిద్ధపడడం జరిగి ఉండునా? కానీ వాళ్ళిద్దరికీ (ఎమ్టీరావు, మిస్ మేరీ లకు) అలా వ్యవహరించక తప్పని పరిస్థితులు ఎదురవుతాయి. వాళ్ళిద్దరూ ఎంత గడుసు వాళ్ళో ప్రేక్షకులకు అంతకు ముందే తెలిసి పోతుంది. కూటికోసం కోటి విద్యలు ప్రదర్శించగలిగే దేవయ్యను ‘ప్రభుత్వం భిక్షాటనను నిషేధించిందని’ భయపెట్టి ఎమ్టీరావు తమ వెంట తీసుకెళతాడు.

ఒక ఊళ్ళో నాయుడు తప్పిపోయిన తమ పెద్ద కూతురు మహాలక్ష్మి పేరుతో ఒక బడి నడుపుతుంటాడు. బడికి సెక్రటరీ గానే గాక అందులోనే మాస్టారుగిరీ వెలగబెడుతున్న ఆయన  మేనల్లుడు రాజు ఊళ్ళో ఎవరిదో బర్రె తప్పిపోయిందని విని తానో డిటెక్టివుననే భ్రమతో బళ్ళో పిల్లల్ని గాలికొదిలేసి, బర్రెను వెదుకుతూ తనూ గాలికి తిరుగుతూ ఉంటాడు. అదే బళ్ళోని ఇంకో ఉపాధ్యాయుడు పిల్లల్ని శిక్షించడమూ, వాళ్ళచేత ఆయుర్వేద మందులు నూరించడమూ మాత్రమే తెలిసిన వాడు. వాళ్ళిద్దరూ కలిసి స్కూలును ముంచేస్తారని కంగారు పడి నాయుడు భార్యా భర్తలైన ఇద్దరు గ్రాడ్యుయేట్లు కావాలని పేపర్లో ప్రకటించి, మారు పేర్లతో వచ్చిన వీళ్ళిద్దరినీ వాళ్ళిద్దరి స్థానాల్లో చేర్చుకుంటాడు.

తప్పిపోయిన మహాలక్ష్మే మేరీ యేమోననే అనుమానం ఆ ‘డిటెక్టివ్’ రాజుకు వస్తుంది. ఇంకోవైపు వీళ్ళిద్దరూ ఊళ్ళో దిగ్గానే నాయుడు ‘కూతురూ-అల్లుడూ’ అని వరసలు కలిపేస్తాడు. ఈ వరసలు మేరీకి నచ్చక చిరచిరలాడుతూ, తన కోపాన్నంతా ఎమ్టీరావు మీద చూపిస్తూంటుంది. గట్టిగా దెబ్బలాడడానికి ఆమెకు కూడా భయమే. ఇంటిదగ్గర ఆమె చదువు కోసం చేసిన అప్పు కొండలా పెరిగి పోయింది. అప్పిచ్చిన డేవిడ్ “బాకీ తీర్చొద్దు నన్ను పెళ్ళి చేసుకో” అని వేధిస్తున్నాడు. వాడి బాకీ వాడి మొహాన కొట్టి, అటు వాడితోనూ, ఇటు ఎమ్టీరావుతోనూ ఒకేసారి తెగతెంపులు చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్టు కనబడుతుంది.

అయితే నాయుడి చిన్న కూతురు ఎమ్టీరావుతో చనువుగా ఉంటుంది. ఆ పిల్లను చేసుకోబోయే రాజుకు ఇది సహజంగానే నచ్చదు. ఒకసారి మేరీ తాము నిజంగా దంపతులం కామనే నిజాన్ని బయట పెట్టబోయే సరికి ఎమ్టీరావు కంగారు పడి ఆమెకు కిరస్తానీ దయ్యం పట్టిందని అంటాడు. అప్పుడు ఆ దయ్యాన్ని బెదిరించడానికి అన్నట్టు గా నాయుడు “నువ్వు కాకపోతే మ అల్లుడికి (ఎమ్టీరావుకి) పిల్లే దొరకదనుకున్నవా? మా పిల్లనే ఇచ్చి చేస్తాం.” అంటాడు. ఈ విషయం దేవయ్య ద్వారా విన్న రాజు కంగారు పడి తర్వాత మెల్లగా ధైర్యం చేసి, మేరీని కలిసి, ఎమ్టీరావుకు బదులుగా తనే తన మరదలికి సంగీత పాఠాలు నేర్పడానికి వీలుగా ఆమె సలహా మీదే ఆమె దగ్గర సంగీతం నేర్చుకోబోతాడు.

తప్పిపోయిన మహాలక్ష్మే మిస్ మేరీ యేమోననే అనుమానం తీర్చుకోవడానికి ఒక నాటి అర్ధరాత్రి తన అసిస్టెంటుతో సహా మేరీ వాళ్ళుంటున్న ఇంటికెళ్ళి, ఆమె పడక మీదికి టార్చ్ లైటు వేసి చూస్తాడు రాజు. ఆ వెలుతురుకు మేరీకి మెళకువ రావడం, డిటెక్టివులు పారిపోవడంతో అంతా గందరగోళమవుతుంది. అనుకోని ఈ సంఘటనతో కలవరపడిన మేరీకి కలత నిద్ర పడుతుంది. ఆ కలతనిద్రలో ఒక పీడకల.. ఆ పీడకలలో తనను బలవంతంగా పెళ్ళి చేసుకోబోయిన దుర్మార్గుడిగా డేవిడ్, అతడి బారి నుంచి తనను కాపాడిన వీరుడిగా ఎమ్టీరావు కనిపిస్తారు. మెల్లగా రామారావుపై అభిమానం పెంకొనే క్రమంలో ఆమే తప్పిపోయిన నాయుడు గారి పెద్దామ్మాయి మహలక్ష్మి అని తెలుస్తుంది. దాంతో కధ సుఖాంతం అయ్యి రామారావుతో మేరీకి, చిన్నకూతురుతో రాజుకు వివాహం జరిపిస్తారు.

fa2117d08f64af22608ba84030f036b0

ఈ సినిమాలో కొన్ని విశేషాలు

సావిత్రికి ఈ సినిమాతో చక్కని అభినేత్రిగా మంచి పేరు వచ్చింది. ఆమె ఇక చిత్ర పరిశ్రమలో తిరిగి చూడ లేదు. మిస్సమ్మ చిత్రము యొతిష్ బెనర్జీ అనే బెంగాలి రచయిత యొక్క “మన్మొయీ గర్ల్స్ స్కూల్” అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి మరియు పింగళి నాగేంద్రరావులు రచించగా ఎల్వీ ప్రసాదు దర్శకత్వంలో రూపొందిచబడినది. సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య మొదలైన వారి నటనతో సినిమా పూర్తి వినోదాత్మకంగా రూపొందింది.

ఈ సినిమా కథ నిజానికి ఒక ఫార్సు. అంటే నిజంగా ఎక్కడా జరగడానికి వీలు లేనిది (కనీసం ఆ కాలంలో). అయినా చక్రపాణి కథన సామర్థ్యం ఆ విషయాన్ని అత్యంత సమర్థవంతంగా మరుగున పరచి ఆ లోపాన్ని ఎవరూ పట్టించుకోనీయకుండా చేసింది. చక్రపాణి ఈ సినిమాను “పెద్దలు సైతం చూడవలసిన పిల్లల సినిమా” అని ప్రచారం చేయించాడు.

మొదట్లో, మిస్సమ్మ పాత్రకు భానుమతి ని నిర్ణయించి కొంత చిత్రాన్ని తీయటంకూడ జరిగినదట. కాని, కొన్ని కారణాల వల్ల ఆపివెయ్యటం జరిగినదట. తరువాత సావిత్రి మిస్సమ్మగా చిత్రం తయారు చెయ్యబడినదట. ఈ విషయం హాసం పత్రికలో వ్రాయబడినది.

చిత్ర సాంకేతికం

సినిమా రిలీజ్ జనవరి – 12 -1955
రచన – చక్రపాణి
సంగీతం – సాలూరి రాజేశ్వరరావు
పాటలు- పింగళి నాగేంద్రరావు
నిర్మాతలు-నాగిరెడ్డి, చక్రపాణి
దర్శకత్వం- ఎల్వీ ప్రసాద్

పాటలు
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, ఔనంటే కాదనిలే కాదంటె ఔననిలే  – ఏ.ఎం.రాజా

బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే – పింగళి నాగేంద్రరావు, సాలూరు రాజేశ్వరరావు, పి.సుశీల, ఏ.ఎం.రాజా

రావోయి చందమామ మా వింత గాధ వినుమా – ఏ. ఎం. రాజా , పి. లీల

బాలనురా మదనా – పి. సుశీల

ధర్మం చెయ్ బాబు, కానీ ధర్మం చెయ్ బాబు – రేలంగి

ఈ నవనవాభ్యుదయ – ఏ. ఎం. రాజా

కరుణించు మేరి మాత – పి. లీల

రాగ సుధారస – పి. లీల

తెలుసుకొనవె చెల్లి, అలా నడుచుకొనవె చెల్లీ – పి. లీల

తెలుసుకొనవె యువతి, అలా నడుచుకొనవె యువతీ – ఏ. ఎం. రాజా

సినిమా చూడండి-

 

ఆలీబాబా 40 దొంగలు (1970) -(Alibaba 40 Dongalu)

TeluguFilm_Alibaba_40_dongalu2
ఆలీబాబా 40 దొంగలు బి విఠలాచార్య దర్శకత్వంలో గౌతమీ పిక్చర్స్ పతాకంపై నిర్మింపబడిన జానపద సినిమా. 1970 దశకంలో తీసిన ఈ చిత్రం అత్యంత ప్రేక్షకాధరణ పొందినది.

నిర్మాణం – ఎన్. రామబ్రహ్మం, అనూరాధాదేవి
సంగీతం     ఘంటసాల

తారాగణం     
నందమూరి తారక రామారావు, జయలలిత, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ
కధ
ఒక అడవి ప్రక్క గ్రామంలో ఆలీబాబా తన తల్లితో నివాసం ఉంటాడు. ఆలీబాబా అన్న కాశిం (నాగభూషణం) వ్యాపారస్తుడు,  ఊళ్లో పెద్దమనిషి. అన్నా వదినలు వాళ్ళ ఆస్తులను అనుభవిస్తూ  పెద్దమేడలో ప్రక్కనే ఉంటారు. ఆలీబాబా అడవికి వెళ్ళీ కట్టెలు కొట్టీ అమ్ముకొని బ్రతుకుతుంటాడు.  తమ్ముడు ఆలీబాబా ఆవారాగా తిరుగుతుంటాడు. అన్నగారికి తమ్ముడంటే యిష్టమే కానీ వాణ్ని బాగు చేయాలని మందలిస్తూ వుంటాడు. వదిన (సూర్యకాంతం)కి మరిది, అతన్ని వెనకేసుకుని వచ్చే అత్తగారు (హేమలత) అంటే మంట

ఇక రెండో వైపు అడవిలో దొంగలనాయకుడు మిక్కిలినేని వాళ్ళు అడవిలో ప్రయాణుకులను, గ్రామాలను కొల్లగొట్టి సంపదను ఒక కొండ ప్రాంతంలో గుహలో దాస్తుంటారు. గుహ ద్వారం ఒక మంత్రంతో తెరుచుకుంటుంది. మిక్కిలినేనికి ఓ రోజు వాళ్లు ఎత్తుకొచ్చిన పెట్టెలో ఓ పాప కనబడితే ముచ్చటపడి ఆమెను పెంచి పెద్ద చేసి మార్జువానా అని పేరు పెడతాడు. సత్యనారాయణకు ఆమె అంటే యిష్టం. కానీ ఆమెకు అతనంటే యిష్టం లేదు. ఊళ్లలో డాన్సులు చేస్తూ ఏ వూరు కాస్త పచ్చగా వుందో చూడాలన్న ప్లానుతో వాళ్లు ఆలీబాబా వూళ్లో డాన్సు చేస్తూండగా ఆలీబాబా సాహసం చూసి  యిష్టపడుతుంది.

కట్టెలు కొట్టుకు వచ్చేందుకు వెళ్ళే ఆలీబాబాకు అప్పుడపుడు మార్జియానా కలుస్తుంది.  ఒక రోజు అద్దెకు తెచ్చిన గొడ్డలి పారేసుకుని ఏం చేయాలో పాలుపోక ఉన్న అతడికి గుర్రాలపై వెళుతున్న దొంగల గుంపు కనబడుతుంది. వాళ్ళను అనుసరించి వెళ్ళీ వాళ్ళ మంత్రం పట్టి దానితో గుహలో ప్రవేశిస్తాడు. అక్కడ కల అపార సంపదను చూసి దానిలో నుంచి కొన్ని సంచులతో గుర్రంపై తీసుకొని రహస్యంగా ఇంటికి వస్తాడు. అన్నా వదినలు వీళ్లింటికి వచ్చినపుడు పోయిన గొడ్డలి బదులు హీరో పక్కింటివాడికి గుప్పెడు వరహాలు యివ్వడం చూస్తారు. వచ్చిన డబ్బుతో అన్నగారి చేతులమీదుగా సత్రాలు కట్టించి, అన్నదానం చేయిస్తున్న ఆలీబాబాను ఎలా వచ్చింది ఇంత సంపద అని నిలదీయడంతో అన్నే కదా అని ఫలానా చోట గుహ వుందని చెప్పడంతో అన్న అక్కడికి ప్రయాణం కడతాడు

గుహకు వెళ్లిన అన్నగారు మంత్రం చదివి లోపలకు వెళ్తాడు కానీ అక్కడ డబ్బు చూసి మతి పోగొట్టుకుని బయటకు వచ్చే మంత్రం మర్చిపోతాడు. దొంగలు వచ్చి అతన్ని పట్టుకుంటారు. దొంగలగుహలో అతన్ని ఎంత తన్నినా తన తమ్ముడి పేరు చెప్పడు. విలన్‌ సత్యనారాయణ అతన్ని  తీసుకుని మిక్కిలినేని యింటికి తీసుకువచ్చి అక్కడ చిత్రహింసలు పెడుతూండగా అతని ఆచూకీ తెలుసుకుని హీరో అక్కడకు వెళతాడు. అక్కడ అతడిని చూసిన మార్జినా అక్కణ్నుంచి పారిపోవడానికి సాయపడింది. దాంతో కోపం వచ్చిన విలన్‌ హీరోయిన్‌ను కాల్చబోగా అడ్డుపడిన మిక్కిలినేనికి గుండు తగిలి చనిపోతడు. అన్నగారిని యిల్లు చేర్చాక హీరో మళ్లీ అక్కడకు వచ్చి హీరోయిన్‌ను విలన్‌ బారినుండి కాపాడి తెసుకొస్తాడు. అన్నగారికి వైద్యం చేసి మామూలు మనిషిని చేయడానికి వైద్యుడు అల్లు రామలింగయ్యకు కళ్లకు గంతలు కట్టి తీసుకుని వస్తాడు. అన్నగారు బాగుపడ్తాడు.

దొంగలు తమ గుహ ఆచూకీ తెలిసున్నవాడి గురించి వాకబు మొదలెడ్తారు. తన్నిన వాడికి వైద్యం కావాలి కాబట్టి గ్రామ వైద్యుడిని పట్టుకుని కళ్లకు గంతలు కట్టి తీసుకెళితే ఇదే యిల్లు అంటాడు. అప్పుడు దొంగ తలుపుమీద ఓ మార్కు పెడతాడు. మార్జియానా అది చూసి పక్కనున్న యిళ్లన్నిటికీ అదే మార్కులు పెడుతుంది. దాంతో దొంగ కనుక్కోలేకపోతాడు. మరుసటిరోజు యింకో విధంగాచేసినా అలాగే జరుగుతుంది.

అత్తర్‌ సాయిబు వేషంలో ఉన్న విలన్‌కు మోర్జియానా కంట పడుతుంది. ఆమె కోసం ఊరిపై దాడి చేయబోతాడు. కానీ హీరో వుపాయంతో పశువుల కొమ్ములకు, చెట్ల కొమ్మలకు దివిటీలు కట్టి దొంగలను హడలగొడతాడు. అదంతా హీరో బలగమే అనుకుని బెదిరిన విలన్‌ పీపాల్లో తన అనుచరులను దాచి హీరో యింటికి తీసుకుని వస్తాడు. 39 పీపాల్లో తన అనుచరులను దాచి, చప్పట్లు తట్టినపుడు రమ్మనమని చెప్తాడు. ఆలీబాబా తల్లి హీరోయిన్‌ను నూనె తీసుకురమ్మనమని అంటే ఆమె పీపాలో మనుష్యులు వున్న సంగతి తెలుస్తుంది. తను వెళ్లి విలన్‌ముందు డాన్సు చేస్తూండగా గంట కొట్టినపుడల్లా ఆలీబాబా పీపాలను కిందకు దొర్లించేస్తాడు.

దొంగలనాయకుడు హీరోయిన్‌ను గుహకు ఎత్తుకుని బంధించి హింసిస్తుంటే హీరో వచ్చి విలన్‌తో యుద్ధం చేసి మార్జియానాను కాపాడి ధనం తీసుకువచ్చి ఆమెను పెళ్లాడి అందరికీ ధాన ధర్మాలు చేస్తూ కాలంగడుపుతాడు

విశేషాలు

అరేబియన్‌ నైట్స్‌ ప్రకారం – ఆలీబాబా కథలో అతను దొంగల గుహ కనిపెట్టేనాటికే వివాహితుడు. అతనికి  తన తెలివితేటలతో అడుగడుగునా సహాయపడిన మార్జియానా అతని అన్నగారి యింట్లో పనిమనిషి. ఇందులో హీరోని ప్రేమించిన దొంగల నాయకుడి కూతురుగా మార్చుకొన్నారు.

నిజానికి ఒరిజినల్‌లో ఆలీబాబు దానాలు గట్రా చేసేయడు. దొంగల నాయకుణ్ని చంపి తనను రక్షించిన మార్జియానాకు బానిసత్వం నుండి విముక్తి ప్రసాదించి తన అన్నగారి అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత దొంగల గుహకు అప్పుడప్పుడు వెళ్లి డబ్బు తెచ్చుకుంటూ వుంటాడు. తన తర్వాత పిల్లలకు, మనుమలకు ఆ మంత్రం నేర్పి తరతరాలుగా ధనికులుగా వుండేట్లు చేస్తాడు.

ఈ పేరుతో ఎంజీఆర్, భానుమతి లతో మొదట తమిళంలో తీసారు, తరువాత దానినే తెలుగులో డబ్బింగ్ చేసారు. అయితే ఆ సినిమాకు  ఈ సినిమాకు చాలా మార్పులున్నాయి. తమిళ సినిమాలో అన్న చనిపోతాడు. శవాన్ని తీసుకొచ్చిన హీరో దానిని కుట్టి తరువాత జబ్బుతో చనిపోయినట్టూగా చెప్పి దహనక్రియ చేస్తాడు.

పాటలు
1. అల్లా యాఅల్లా మనిషికి మనిషికి రకరకాలుగా – ఘంటసాల
2. చలాకైన చిన్నది బలేబలేగున్నది కన్నుసైగ – సుశీల, ఘంటసాల
3. చల్లచల్లని వెన్నెలాయె మల్లెపూల పానుపాయె – జయలలిత
4. నీలో నేనై, నాలో నీవై, తీయని కలలే కందాము ఎడబాయని జంటగ వుందాము – సుశీల, ఘంటసాల
5. భామలో చందమామలో – ఘంటసాల,సశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలు
6.  మరీ అంతగా బిడియమైతే మనసు ఆగనంటుంది – ఘంటసాల, సుశీల
7.  లెలో దిల్‌బహార్ అత్తర్ దునియా మస్తానా అత్తర్ ఒక్కసారి – ఘంటసాల
8.  సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు తొలి చిగుళ్ళు వేసే సిగ్గు – సుశీల, ఘంటసాల

సినిమా ఇక్కడ చూడచ్చు –

ఆలీబాబ చిన్నపిల్లల  ఏనిమేషన్ సినిమా కొరకు –

షావుకారు (shavukaru )

shavukaruవిజయా వారి నుడి వచ్చిన అద్భుతమైన ఒక సినిమా షావుకారు. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో 7 ఏప్రిల్ 1950న విదుదలైన దీనిని  నాగిరెడ్డి గారు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఘంటశాల.
తారాగణం – షావుకారు జానకి, నందమూరి తారక రామారావు, గోవిందరాజులు సుబ్బారావు, ఎస్.వి.రంగారావు,శాంతకుమారి, పద్మనాభం, వల్లభజోస్యుల శివరాం, వంగర,

చిత్రకథ

వడ్డీ వ్యాపారం చేసుకునే చెంగయ్య (గోవిందరాజుల సుబ్బారావు), రామయ్య (శ్రీవాత్సవ) బావా బావమరుదులు. ఇరుగుపొరుగులో ఉంటారు. రామయ్య కూతురు సుబ్బులు అంటే చెంగయ్యకు ఇష్టం. ఆమెను కొడుకు సత్యం (యన్.టి.రామారావు) ద్వారా కోడలిగా చేసుకోవాలనేది ఆయన ఆశ. . చెంగయ్య దగ్గర పనిచేసే రౌడీ సున్నం రంగడు (యస్.వి.రంగారావు) బాకీలు వసూలుచేసి పెడుతుంటాడు. ఈ రెండు కుటుంబాల మధ్యా ఆప్యాయతలు వెల్లివిరిసేవి. చెంగయ్య తండ్రి హయాము లో ఒక ధర్మ సత్రం కట్టించారు. అందులో బీదాబిక్కీ జనంవుంటుంటారు. బంగారయ్య అనే వ్యాపారి తన పెద్దకొడుకు వరాలు(రేలంగి)సత్రం లో ఒక పక్క కొట్టు పెట్టుకుంటాడని, సత్రంలో వుండే వాళ్ళూ ఉండవచ్చని, అవసరమైతే అద్దె కూడా ఇస్తామని చెబుతాడు. రంగడు, పంతులు మాటల మీద చెంగయ్య మౌనంగా అంగీకరిస్తాడు. ఐతే కొట్టు పెట్టిన తొలిరోజే బంగారయ్య కొడుకులు అక్కడ ఉన్న జనాలను వెళ్లగొడతారు. గుడ్డి తాత సామాను కూడా గిరాటు వెయ్యడం చూసిన గ్రామస్తులు కొట్టులో సామాను బయట పారవేస్తారు. బంగారయ్య కొడుకులతో చెంగయ్య దగ్గరకు వచ్చి గ్రామస్తులు చెంగయ్యను అవమానించారని చెబుతాడు.

Shavukaru_(1950)పోలీసు పంచాయతీలో చంగయ్యకు ధర్మసత్రం పట్ల ఉన్న హక్కుగురించి పంతులు(వంగర), రామయ్య సాక్షమిస్తారు. రామయ్య చెంగయ్యకు సత్రాన్ని అద్దెకు ఇచ్చే హక్కు లెదని చెప్పడంతో చెంగయ్య కోపగిస్తాడు. రెండు ఇళ్ళకు మధ్య ఉన్న తలుపు మూసేపిస్తాడు. సత్యం తండ్రి ని విడిచి పట్నం వెళ్ళి పోతాడు. రంగడి మాటలతో చెంగయ్య కోపం పెరుగుతుంది. తనకు రావలసిన బాకీ కోసం రామయ్య పైవత్తిడి తెచ్చాడు. నారాయణ కొంచెం దుడుకు మనిషి. నారాయణ భార్య నగలు అమ్మి తీర్చబోతే అంతకు ముందు రామయ్య కొంత బాకీ తీర్చగా దానికి నోటుమీద చెల్లువేయలేదు. ఆ విషయాన్ని దాచిపెట్టి పూర్తిగా చెల్లించమంటాడు చెంగయ్య. రాత్రివేళ రంగడు నారాయణ పంటను తగులబెట్టబోతే నారాయణ కొడతాడు. చెంగయ్య దగ్గరకు వచ్చి నారాయణ చెంగయ్య ను దూషిస్తుంటె ఉప్పు తిన్న వాడిగా అడ్డుకున్నానని అందుకు నారాయణ తనను కొట్టాడని చెబుతాడు. చెంగయ్య తప్పుడు కేసు పెట్టిస్తాడు. చెంగయ్య దగ్గరకు వచ్చి తన అన్నను క్షమించమంటుంది జానకి. చెంగయ్య అంతా తనచేతులనుండి దాటిపోయిందని చెబుతాడు. నారాయణ జైలుపాలౌతాడు.

పట్నంలో కొడుకును చూడడానికి వెళ్ళిన చెంగయ్య, తన కొడుకు సత్యం జైల్లో వుండడాన్ని తెలుసుకుంటాడు. నిజానికి సత్యంకూడా చేయని నేరానికి స్నేహితుని కుట్రవల్ల జైలు పాలవుతాడు. అప్పీలు కోసం దరఖాస్తు పై సంతకం పెట్టమంటే సత్యం తిరస్కరిస్తాడు.తన ప్రమేయంతో కొన్ని, తన ఉదాసీనతతో కొన్ని, తనకు తెలియకుండా జరిగిన సంఘటనలు కొన్ని ఈ స్థితి కల్పించాయని చెంగయ్యకు అర్ధమౌతూ ఉంది. రంగడు తనపెరు చెప్పి అప్పులు తిసుకుంటున్నట్టు తెలుస్తుంది. వాడిని తన బాకీలు వసూలు చేయవద్దని చెబుతాడు. రంగడు తామిద్దరు కలిసి చాలా పనులు చేసామని అవి గుర్తుంచుకోమని చెబుతాడు. ఐతే ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెంగయ్య చెబుతాడు. స్వతహాగానే అంతర్ముఖుడు, ముభావి ఐన చెంగయ్య మరింత ఒంటరి ఐపోయాడు. గత దీపావళి నుండి ఈ దీపావళి వరకు జరిగి మార్పులు తెలుస్తున్నాయి. ఈలోగా చెంగయ్యకు ఎదురు తిరిగిన రంగడు చెంగయ్య ఇంటిని దోచుకోవాలని పథకం వేస్తాడు. పథకం గురించి కూపీ లాగిన చాకలి రామి(కనకం) సుబ్బులుకు చెబుతుంది. చెంగయ్య మావ మీద కోపంతో సుబ్బులు ఈ విషయం రహస్యంగాఉంచుతుంది. మనసు నెమ్మళించక వదినకు ఈ విషయం చెబుతుంది. శాంతమ్మ బుర్రకథ దగ్గరకు వెళ్ళిన మావగారికి ఈ సంగతి చెప్పడానికి వెళుతుంది. ఈ లోగా సుబ్బులు ఉండబట్టలేక గోడదూకి చెంగయ్యను నిద్రలేపుతుంది. అనుకోకుండా వచ్చిన సుబ్బుల్ని చూసి ప్రమాదాన్ని పట్టించుకోకుండా సంతోషపడి పోతాడు. సుబ్బులు రంగడి సంగతి చెప్పి బయటకు వెళ్ళిపోదామని బతిమాలుతుంది. సుబ్బులు ఎంతచెప్పినా చెంగయ్య బయటకు రాడు. రంగడు, దొంగలతోవచ్చి స్థంభానికి కట్టి హింసించినా ఇనపపెట్టె తాళాల ఆచూకీ చెప్పడు. సుబ్బుల్ని కూడా హింసించడం మొదలు పెట్టగానే తాళాలు ఎక్కడున్నది చెప్పేస్తాడు. పెట్టె తాళం తెరిచేసమయానికి రామయ్య గ్రామస్స్తులతొ వచ్చి రంగడిని, అతని బృందాన్ని బంధిస్తారు. రామయ్య కుటుంబానికి ఎంతో అన్యాయం చేసినా వారు తనను రక్షించినందుకు చెంగయ్య పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. సత్యం, నారాయణ జైలునుంచి తిరిగి వస్తారు. సత్యంతో సుబ్బులుకు పెళ్ళి జరుగుతుంది.

సినిమాలో కొన్ని విశేషాలు

shavukaru-telugu-old-movie

చిత్ర మకుటం షావుకారు. ఆ పాత్ర చిత్రకథలో ప్రతి నాయకుడు వంటిది. మరొ వైపు నుండి చూస్తే చిత్రకథానాయకుడూ ఆయనే. విలన్‌గా అనిపిస్తూ భావోద్వేగాలను పండిచేపాత్ర. దర్శకుడికి ఈ పాత్రపై మక్కువ వలన దానిని నమ్మకాల మద్య, అనుభందాల మద్య ఉండే విషయాలను చూపిస్తూ, మాట పట్టింపులను బట్టి మనుషులు మనస్తత్వాలు ఎలా మార్చుకొంటారో చూపించారు.
చక్రపాణి రూపొందించిన ఈ పాత్ర సాధారణ చిత్రాలలోని విలన్ పాత్రలకు ఎంతో భిన్నమైనది.మనుషులకు, పెద్దకుటుంబాలలో వ్యక్తులకు సహజమైన భావోద్వేగాలు ఈ పాత్రలో కనిపిస్తాయి.
చెంగయ్య లో పశ్ఛాత్తాపంకూడా ఒక్కసారిగా జతరిగింది కాదు. పాత్రలోని అంతరంగకల్లోలం చిత్రపొడుగూతా అవగతమౌతూనే ఉంది.అర్ధ రాత్రి సుబ్బుల్ని గుమ్మంలో చూసిన చెంగయ్య స్పందన తెలియజెస్తుంది. తను చేస్తున్నది మంచో చెడో తెలుసుకోలేని అవివేకి కాదు చెంగయ్య పాత్ర. నిజాన్ని ఒప్పుకోవడంలో అడ్డువచ్చే అభిజాత్యం అతనిలో ఎక్కువ. ‘నీచెంగయ్య మావ ఎవరినమాటా వినడే’ అంటాడు సుబ్బులుతో.

పాటలు

1.ఇంతేనన్నా నిజమింతేనన్నా గుట్టురెరిగిన గురురాయలు – మాధవపెద్ది సత్యం
2.ఏమనెనే చిన్నారి ఏమనెనే వన్నెల సిగపువ్వా కనుసన్నలలో – ఘంటసాల
3.తెలుపవేలనే చిలుకా పలుకవేలనే బదులు – రావు బాలసరస్వతీ దేవి, ఘంటసాల
4.తెలుపవేలనే చిలుకా పలుకవేలనే బదులు పలుకవేలనే – రావు బాలసరస్వతీ దేవి
5.దీపావళి దీపావళి ఇంటింట ఆనంద దీపావళి మాయింట- రావు బాలసరస్వతీ దేవి
6.దీపావళి దీపావళి ఇంటింట ఆనంద – రావు బాలసరస్వతీ దేవి, శాంతకుమారి బృందం
7.పలుకరాదటే చిలుకా సముఖములో రాయభారమెందులకే – ఘంటసాల
8.భాగవత పఠనం – ఎం. ఎస్. రామారావు
9.బలే దొరలకు దొరకని సొగసు అనువుగ దొరుకును రంగయ్య – టి. కనకం
10.మారిపోవురా కాలము మారుట దానికి సహజమురా – మాధవపెద్ది సత్యం
11.వలపుల వలరాజా తామసమిక చాలురా విరిశరములకిక – జిక్కి, పిఠాపురం
12.విరహవ్యధ మరచుకథ తెలుపవే ఓ జాబిలి – పిఠాపురం, జిక్కి
13.శ్రీలుచెలంగే భారతభూమిన (హరికథ) – ఘంటసాల (మోపర్రు దాసు వ్యాఖ్యాంతో)

సినిమా ఇక్కడ చూడండి

 

రాజమకుటం (Rajamakutam)

220px-Raja_Makutam

రాజమకుటం వాహినీ ప్రొడక్షన్స్ వారి ఒక విజయవంతమైన సినిమా. రామారావు, రాజసులోచనలు నటించిన ఈ సినిమాకు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకులు. సంగీతం మాస్టర్ వేణు, రచన డి.వి. నరసరాజు

కథలో ప్రతాప సింహుడు ( రామారావు) యువరాజు. రాజు తమ్ముడు మంత్రి అయిన గుమ్మడి రాజును కుట్ర పన్ని చంపి వేస్తాడు. దానిని యువరాజుకు తెలియనీయకుండా కొంత మంది అమాయకులను రాజహత్యా నేరం క్రింద మరణ శిక్ష విధించేటట్లు చేస్తాడు. ఆ చనిపోయిన వారిలో కథానాయిక ప్రమీల (రాజ సులోచన) అన్న కూడా ఉంటాడు. దానితో ఆమె కొందరు విప్లవ కారులతో చేరి రాజుకు వ్యతిరేకంగా ఉద్యమం నడుతుంది. ఒకానొక సమయంలో ఆమెను రక్షించిన యువరాజుకు ఆమె ద్వారా జరుగుతున్న ఘోరాలు తెలుస్తాయి. దాంతో ఇంట్లో తనపై హత్యా ప్రయత్నం నుండి తప్పించుకోవడానికి పిచ్చి పట్టినట్టుగా నటిస్తూ రాత్రి రహస్య మార్గం గుందా తల్లి సహాయంతో తప్పించుకొంటూ నల్లత్రాచు అనే పేరుతో దుర్మార్గుడైన మంత్రి ఆట కట్టించి ప్రమీలను వివాహం చెసుకొని సింహాసనం అధిష్టిస్తాడు

పాటలు

 1. అంజలిదే జననీ దేవీ … కంజదళాక్షి కామతదాయిని – పి.లీల
 2. ఊరేది పేరేది ఓ చందమామా నినుచూచి నిలికలువ – పి.లీల,ఘంటసాల -రచన: రజనీకాంతరావు
 3. ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కలరేడు చూడచక్కని చుక్కలరేడు – పి. లీల
 4. చూడచక్కని చుక్కలరేడు .. ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కలరేడు (బిట్) – ఘంటసాల
 5. ఏటివడ్డున మా ఊరు ఎవ్వరు లేరు మావారు ఏరు దాటి – జిక్కి బృందం
 6. కాంతపైన ఆశ కనకమ్ముపై ఆశలేని వాడు ధరణిలేడురా – మల్లికార్జునరావు బృందం
 7. జయజయ మనోఙ్ఞమంగళ మూర్తి శారదనీరద నిర్మల కీర్తి – సుశీల
 8. జింగన టింగన ఢిల్లా కొంగన ముక్కున జెల్లా రంగు ఫిరాయించి – జిక్కి బృందం
 9. రారండోయి రారండోయి ద్రోహుల్లారా విద్రోహుల్లారా – మాధవపెద్ది బృందం
 10. సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే – (రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి : పి.లీల
 11. హేయ్… తకిట తకిట ధిమి తబల – ఘంటసాల ( ఎన్.టి. రామారావు మాటలతో ) – రచన: కొసరాజ

 

చిత్రం వీడియో లింక్ – https://www.youtube.com/watch?v=zhf9Ex-tDwE

చంద్రహారం (1954) Chandraharam

Chandrahaaram 5

విజయా వారి మరో మంచి చిత్రం  చంద్రహారం. 1954 లో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అంతగా ప్రేక్షకాధరణ పొందలేదు. కారణం ఇప్పటి క్లాసిక్‌లకు బి,సి సెంటర్లలో మార్కెట్ ఉండనట్టుగా అప్పటి ఈ సినిమాకు అదే జరిగింది. సినిమా మెల్లగా సాగటం, పాటలు కూడా నెమ్మదైన స్వరాలలో ఇవ్వడం, చిత్రీకరణ అంతా అందమైన పెయింటింగ్‌లా ఉన్నా సలు కథ సగం నుండి కూడా మొదలు కాకపోవడం వలన అందమైన ఈ చిత్రం పరాజయం పాలైంది. సాధారణంగా విజయా వారు తీసిన సినిమాలను విడుదల వరకూ దాచిపెట్టరు, సినమా రషెస్ ఎప్పటికప్పుడు ఇతర సినిమా జనానికి, డిస్ట్రిబ్యూటర్లకు, విలేకరులకు చూపుతూంటారు. అలా సినిమాను చూసిన సినీ జనమంతా సినిమా సూపర్ హిట్ అవుతుందన్నారు. విజయా వారు పాతాళ భైరవి తర్వాత ఆ స్థాయిలో నిలిచిపోవాలనుకుని ఈ సినిమా తీయడంతో, అందుకు తగట్టు మంచి ప్రచారం చేయించారు. ఆంధ్ర ప్రాంతంలోని అన్ని కేంద్రాల్లోనూ సినిమాను విడుదల చేశారు. సినిమాలో కథ మెల్లిగా సాగడం, హీరో ఎంతకూ నిద్రలేవకపోవడం వంటి అంశాల వల్ల సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

   కథ కొస్తే చందనరాజు ప్రాణం అతని మెడలోని హారంలో వుంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి (గౌరి)నే పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలనుకున్న ధూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయున్ని పంపి ఆ పోలికలు వున్న అమ్మాయిని లేకుండా చేయాలనుకుంటాడు. ఇలా వుండగా రాకుమారుని పాట విని యక్షకన్య చంచల వచ్చి తనను ప్రేమించమని కోరి, భంగపడి అతని మెడలోని చంద్రహారాన్ని తీసుకుని పోతుంది. ఫలితంగా అతను మరణిస్తాడు. మరో యక్షిణి సహాయంతో మళ్ళీ జీవిస్తాడు కాని చంద్రహారం ఉన్నపుడు మాత్రమే జీవంతో ఉంటాడు. గౌరికి పింతల్లి పిచ్చివాడితో వివాహం నిచ్చయిస్తుంది. దానితో ఆమె తండ్రి ఆమెను ఇంటి నుండి పంపేస్తాడు. అలా వెళుతున్న ఆమెను కొందరు దుండగులు వెంబడించడంతో పారిపోతూ యువరాజు నిద్రపోతున్న మందిరంలోకి వెళ్ళిదాకుంటుంది. రాత్రిలో నిద్రలేచిన యువరాజు ఆమెను ఆమెకు తను గీసిన చిత్రం చూపి వివాహం చేసుకుంటాడు. యక్షినీ అది గమనించి ఆమెను అనేక బాధలకు గురిచేస్తుంది. చివరకు ఆమె పాతివ్రత్య మహిమ వలన దేవతలచే శపించబడి తన మహిమలను కోల్పోతుంది. యువరాజుకు ప్రాణగండం తప్పుతుంది.


నటీనటులు

* నందమూరి తారక రామారావు,
* శ్రీరంజని (జూనియర్)
* సావిత్రి,
* ఎస్.వి. రంగారావు

సంగీతం     ఘంటసాల వెంకటేశ్వరరావు
chandraharam_savitri_poster
పాటలు
* ఆంగికం భువనం – జయజయజయ విజయేంద్ర – ఘంటసాల బృందం
* ఇది నా చెలి ఇది నా సఖీ నా మనోహరీ – ఘంటసాల
* ఎవరివో ఎచటినుంటివో ఓ సఖీ ఎవరివో – ఘంటసాల, ఎ.పి.కోమల
* ఎవరే ఎవరే చల్లని వెన్నెల జల్లులు చిలకరించునది – కె. రాణి బృందం
* ఏమి శిక్ష కావాలో కోరుకొనవే ప్రేయసి – ఘంటసాల
* ఏనాడు మొదలిడితివో విధి ఏనాటికయ్యెనే నాటక సమాప్తి – ఘంటసాల
* ఏ సాధువులు యందు హింసల పడకుండ (పద్యం) – పి. లీల
* ఏంచేస్తే అది ఘనకార్యం మనమేంచేస్తే అది – పిఠాపురం బృందం
* నీకు నీవే తోడుగా లోకయాత్ర సేతువా – మాధవపెద్ది
* లాలి జయ లాలి లాలి శుభ లాలి సుగుణములే జయహారముగా – లలిత
* విఙ్ఞాన దీపమును వెలిగింపరారయ్య – ఘంటసాల, ఎ.పి. కోమల బృందం

Video link of Chandraharam – https://www.youtube.com/watch?v=QsQp5-AZeGo

శ్రీరంజని (సీనియర్) Sri Ranjani

Sriranjani_senior

శ్రీరంజని (సీనియర్)గా ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీరంజని తెలుగు నటీమణులలో మొదటి నాయక. ఈమె జననం 1906.  ఈవిడ మరో ప్రముఖ నటి శ్రీరంజని (జూనియర్)కు అక్క మరియు దర్శకుడు ఎం.మల్లికార్జునరావుకు తల్లి. 1906 లో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో జన్మించిన ఈమె  1920, 1930లలో గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా వారు విడుదలచేసిన నాటకాలను రికార్డులలో గాయనిగా తన ప్రైవేటు గీతాల ద్వారా ప్రసిద్ధి పొందారు.

శ్రీరంజని చిత్రాలలో నటించకముందు పౌరాణిక నాటకాలలో అభిమన్యుడు, సత్యవంతుడు, కృష్ణుడు వంటి పురుష పాత్రలు వేసేవారు.  ఆవిడ కృష్ణ విలాస నాటక సమాజం లో సభ్యురాలుగా ఉండేవారు.

శ్రీరంజని బెజవాడ హనుమాన్‌ దాసు గారి దగ్గర సంగీతం నేర్చుకుంది. మహాకవి కాళిదాసు (1960), ప్రమీలార్జునీయం (1965) వంటి చిత్రాల నిర్మాత కె.నాగమణి గారు కూడా హనుమాన్‌దాసు గారి దగ్గరే హార్మోనియం నేర్చుకున్నారు. శ్రీరంజని నాటకాలలో నటిస్తున్నప్పుడు నాగుమణి గారు హార్మోనియం వాయించేవారు. పరిచమయిన కొన్నాళ్ళకి వారిద్దరు భార్యాభర్తలయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. శ్రీరంజని తను చనిపోయేముందు పిల్లల సంరక్షణార్థం తన భర్తను తన చెల్లెలు మహాలక్ష్మిని పెళ్ళి చేసుకోమని చెప్పారు. తర్వాత ఆమె పేరును కూడా శ్రీరంజనిగా మార్చారు. ఆవిడ శ్రీరంజని జూనియర్ గా ప్రసిద్ధి పొందారు, అందువలనే శ్రీరంజనికి సీనియర్ శ్రీరంజని అని పేరు వచ్చింది.
రంగస్థల జీవితం


శ్రీరంజని మేనత్తలు నాట్యము చేసేవారు, పాడేవారు. శ్రీరంజనికి ఉత్సాహం కలిగి వారిదగ్గరే ప్రాథమిక పాఠాలు నేర్చుకుంది. రాధాకృష్ణ, శశిరేఖాపరిణయం, సావిత్రి, కనకతార, ఉషాపరిణయం మొదలైన నాటకాలు శ్రీరంజనికి పేరు తెచ్చాయి. అవసరాన్ని బట్టి ఆవిడ నాటకాలలో మగవేషాన్నీ వేసేది. శశిరేఖాపరిణయంలో శశిరేఖ వేసేది, అభిమన్యుడు వేసేది, రాధాకృష్ణలో రాధ, కృష్ణ రెండూ పాత్రలు వేసేది. ఆమెది మంచి గాత్రమని హెచ్.ఎమ్.వి. గ్రామఫోను సంస్థ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుని ఎన్నో గ్రామఫోను రికార్డులలో పాడించింది.

శ్రీరంజనికి ప్రయత్నం లేకుండానే సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది. హెచ్.ఎమ్.వి వారు రిహార్సల్సుకని శ్రీరంజనిని బెజవాడ తీసుకువెళ్ళారు. ఆ సమయంలో సి.పుల్లయ్య గారు లవకుశ చిత్రం ఆరంభించడానికి నటులకోసం వెతుకుతున్నారు. ఆ చిత్రంలో శ్రీరామునికి పాత్రకి పారుపల్లి సుబారావునీ, వాల్మీకి పాత్రకి పారుపల్లి సత్యనారాయణనీ నిర్ణయించగా వారి ద్వారా శ్రీరంజని గురించి తెలుసుకున్నారు. అలా శ్రీరంజనికి సీతపాత్ర ఖరారు అయ్యింది. శ్రీరంజని, నాగుమణి ముందు గ్రామఫోను రికార్డింగు నిమిత్తం బెంగళూరు వెళ్ళి అక్కడి నుండి లవకుశ షూటింగ్ కోసం కలకత్తా వెళ్ళారు. లవకుశతో శ్రీరంజనికి శోకపాత్రలే ఎక్కువ వచ్చాయి. మాయాబజార్ (1936)లో సుభద్ర, సతీ తులసి (1937)లో పార్వతి, సారంగధర (1937)లో రత్నాంగి, చిత్రనళీయం (1938)లో దమయంతి, శ్రీకృష్ణలీలలు (1935)లో దేవకి, నరనారాయణ (1937)లో గయుని భార్య, మార్కండేయ (1938)లో మరుద్వతి, వరవిక్రయం (1939)లో భ్రమరాంబ ఆమెకు లభించిన ముఖ్య పాత్రలు. ఈ తొమ్మిది చిత్రాలే శ్రీరంజని నటించిన చిత్రాలు. వీటిలో వరవిక్రయం ఒక్కటే సాంఘికం మిగాతావన్నీ పౌరాణిక చిత్రాలే. ఈ తొమ్మిది చిత్రాల తోనే ఆవిడ మేటితారగా ఎదిగారు. ఆవిడ సినిమాలలోకి వచ్చిన తర్వాత కూడా నాటకాలలో నటించడం మానలేదు. పాట, పద్యం మాత్రమేకాకుండా హావభావాలు ప్రకటించడంలోనూ శ్రీరంజనికి మంచి పేరుండేది. ఆమెది చక్కటి ఉచ్ఛారణ అని, చక్కని భాష అనీ ప్రేక్షకులు చెప్పుకునేవారు. శ్రీరంజని చివరి చిత్రం వరవిక్రయము (1939)

నాటకాలలో నటించినవారికంటే చలనచిత్రాలలో నటించిన వారికే ఆకర్షణ ఎక్కువ. రంగస్థలం నుండి చలనచిత్రరంగంలోకి ప్రవేశించిన సి.ఎస్.ఆర్, గగ్గయ్య, కన్నాంబ వంటి వారితోటే ప్రేక్షకాదరణ మొదలైంది. ఐతే ఆరాధన, అభిమానం మాత్రం శ్రీరంజనితోనే మొదలయ్యాయి. తెలుగులో మొదటి బాక్స్‌ఆఫీసు చిత్రంగా చెప్పుకోవలసిన లవకుశ (1934) లో శ్రీరంజని సీత పాత్ర ధరించింది. సినిమాతో పాటు శ్రీరంజనికీ ప్రేక్షకాదరణ లభించింది. ఆ చిత్రంలో సీతాదేవి కష్టాలను చూసి ప్రేక్షకులు కన్నీళ్ళ పర్యంతమయ్యేవారు, సాక్షాత్తు సీతమ్మే తెరమీదకి దిగివచ్చినట్టు నమ్మేవారు. శ్రీరంజనికి ఇదే తొలి చిత్రం అంతకుముందు రంగస్థలనటి. ఈవిధంగా తొలి చిత్రంతోనే గ్లామరు, ఆరాధన సంపాదించుకున్న మొదటి నటి శ్రీరంజని.

లవకుశ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న రొజుల్లో ఆమేకు అనేక చోట్ల సన్మానాలు జరిగాయి. ప్రజలు శ్రీరంజనికి పసుపుకుంకుమలు ఇచ్చి నమస్కారాలు పెట్టేవారు, కొందరు పాదనమస్కారాలు చేసి చీరిచ్చేవారు. సొంతవూరులో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమెను అభిమానులు వెళ్ళి గుడి దేవతను ఆరాధించినట్టు, పళ్ళు, పువ్వులు, పాలు ఇచ్చి దండాలు పెట్టేవారు. మద్రాసులోని క్రౌన్‌టాకీసులో లవకుశ శతదినోత్సవం జరిగింది, ఆ ఉత్సవంలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, మద్రాసు గవర్నరు, జైపూరు మహారాజావారు పాల్గొని చిత్రాన్ని, దర్శకుడు సి.పుల్లయ్యని, నటవర్గాన్ని ప్రసంసించారు. ఆ సంధర్భంలో శ్రీరంజనికి స్వర్ణపతకం బహుకరించారు.

1939 సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడిన శ్రీరంజని అదే సంవత్సరం తన స్వగ్రామంలో పరమపదించారు. అప్పుడు ఆమె వయసు కెవలం 33. ఆమె మరణవార్తకి పత్రికలు ప్రాముఖ్యం ఇచ్చి చిన్న వయస్సులోనే పెద్ద తార రాలిపోయిందంటూ రాశాయి. సీతాదేవిగా శ్రీరంజనిని చూసి కన్నీళ్ళు పెట్టుకున్న ప్రేక్షకులు ఆమె మరణవార్త విని మరింత శోకించారు.

గుణసుందరి కథ (Gunasundari katha)

200px-Gunasundari-katha

కే.వీ రెడ్డి గారి అనేక అద్భుత చిత్రరాజాలలో ఒక అద్భుత చిత్రం గుణసుందరి కథ.

చిత్ర విశేషాలు
* దీనికి స్ర్కీన్‌ప్లే కేవి రెడ్డి, కే కామేశ్వరరావులు అందించారు. దర్శ్క నిర్మాత కేవి రెడ్డి గారైనా కమలాకర కామేశ్వరరావు, డి.బి.జి తిలక్‌లు ఈ చిత్రానికి దర్శకులుగా పనిచేసారు
* కథను, మాటలు, పాటలను అందించినది –  పింగళి నాగేంద్రరావు
* ప్రొడక్షన్, పంపిణీ, నిర్మాణం  – వాహినీ సంస్థ
* కళాదర్శకుడు, కెమేరా –  మార్కస్ బార్ట్లే
* సంగీత దర్శకుడు  ఓగిరాల రామచంద్రరావు
* నేపథ్య గాయకులు – పి.లీల,  ఘంటసాల, టి.జి.కమలాదేవి, టి.కనకం, పి.కృష్ణమూర్తి
* నృత్యాలు –  పసుమర్తి కృష్ణమూర్తి
* కళా దర్శకుడు – కె.నాగేశ్వరరావు

పాత్రధారులు
* ఉగ్రసేన మహారాజు – డాక్టర్ గోవిందరాజు సుబ్బారావు
* రూప సుందరి – శాంతకుమారి
* హేమ సుందరి – మాలతి
* గుణసుందరి – జూనియర్ శ్రీరంజని
* హరమతి – గోబేరు సుబ్బారావు
* కాలమతి – రేలంగి
* దైవాధీనం – కస్తూరి శివరావు
* వీరసేన యువరాజు – వి శివరాం
* పార్వతీ దేవి – టి జి కమలాదేవి
* మొదటి యక్షిణి – హేమలత
* రెండో యక్షిణి – కనకం
* మూడో యక్షిణి – లక్ష్మీరాజ్యం
* సింగారి – సీత
* శివుడు – జంధ్యాల గౌరీపతిశాస్త్రి

చిత్ర కథ
ఈ కథ పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తూ వెళుతుండగా మొదలౌతుంది. ఒక యువతి ఏడుస్తూ దేవిని ప్రార్ధిస్తూ ఉండటం ఆమె ప్రక్కన ఒక ఎలుగుబంటి కూర్చొని ఉండటం చూసి పార్వతి ఆమె కథ వివరించమని పరమేశ్వరుని వేడుకొంటుంది. ఆయన ఆ కథను వివరిస్తూ ఉంటాడు.
ధారానగరాన్ని పరిపాలించే రాజు ఉగ్రసేనునికి హేమసుందరి, రూపసుందరి మరియు గుణసుందరి అనే ముగ్గురు కుమార్తెలు. గుణసుందరి (శ్రీరంజని)కి జన్మనిస్తూ ఆమె తల్లి చనిపోవడంతో రాజు మళ్ళీ వివాహం తలపెట్టక ముగ్గురు కుమార్తెలనూ అల్లారు ముద్దుగా పెంచుతుంటాడు. ముగ్గురు కుమార్తెలూ యవ్వనవతులైనాక ప్రజలకు పరిచయం చేసేందుకు సభకు తీసుకొస్తాడు. అక్కడ వారిని తనగురించి చెప్పమన్నపుడు పెద్దకుమార్తెలు తండ్రిని తాము అందరికంటె ఎక్కువగా ప్రేమిస్తామని, గౌరవిస్తామని చెపుతారు. గుణసుందరి తాను తండ్రిపై గౌరవం అభిమానం ఉన్నాయని కాని తను తన భర్తనే అందరి కంటే అధికంగా ప్రేమించాలని చెపుతుంది. దానితో కోపం వచ్చిన రాజు నీ భర్త ఎవరైనా ప్రేమిస్తావా అని అడుగుతాడు. ప్రేమిస్తానని చెప్పటంతో రాజ్యంలోని కుంటీ, గుడ్డీ, మూగ, చెవిటి వాళ్ళనందరినీ తెప్పించి వారిలో అన్ని అవలక్షణాలు కల ఒక ముసలి(కస్తూరి శివరావు)ని ఇచ్చి ఆమెకు వివాహం జరుపుతాడు. అదే మూహూర్తంలో ఆమె అక్కలకు తన మేనళ్ళుళ్ళతో వివాహం జరుపుతాడు.

తదనంతరం ఒకానొక సంధర్భంలో ఆ ముదుసలి వినికిడి వాక్కు బాగా ఉన్నవాడని తెలియడం, అతడు తన మేనళ్ళుళ్ళతో వాదనలకు దిగటం చూసిన రాజు వాళ్ళ ఉనికి సహించలేనివాడై ఇంటినుండి పొమ్మంటాడు. అ సందర్భంలో ముసలివానిని కొట్టబోయి పట్టు తప్పి మెట్ల పైనుండి పడి కాలుకు బలమైన గాయాలు తగులుతాయి. గుణసుందరి భర్తకు జరిగిన అవమానంతో అతడితో కలసి అతడి పల్లెకు వచ్చేస్తుంది. భర్తతో కలసి సామాన్యజీవితం గడుపుతూ ఉంటుంది. ఒకరోజు నీటికై చెరువుకు వెళ్ళిన ఆమెను ఒక యువకుడు వెంబడించి ఆమెను వివాహం చేసుకొంటానని చెపుతూ చేయి పట్టుకొంటాడు. ఆమె అతడిని చెంబుతో నుదుటిపై కొడుతుంది. ఇంటికి వచ్చి భర్తతో జరిగింది చెపుతుంది. తరువాత భర్త నుదుటన కూడా గాయం ఉండటం చూస్తుంది. ఒకనాడు భర్త ఆమె ఎప్పుడూ చదువుతుండే పతివ్రతల పుస్తకంలో ఆమె కథను రాసి ఆమెను వెంటాడిన యువకుని బొమ్మ వేస్తాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయి మీరు సామాన్యులు కాదు, మారురూపాన ఉన్న ఎవరో గొప్పవారు, నన్ను పరిక్షీంచక నిజం చెప్పమని కోరుతుంది. అతడు చెరువు దగ్గర వెంటాడిన తన నిజరూపంలో ఆమెకు కనిపిస్తాడు. తన పేరు వీరశేనుడని తను ఒక రాకుమారుడనని చెప్పి తను తన గురువు కారణంగా శాపానైకి గురియైన వైనం చెప్పి, దానిని భార్యకు తప్ప పరులు ఎవరికీ తెలియనివ్వరాదని తెలిసిన క్షణం తాను ఎలుగుబంటిగా మారిపోతానని ఎవరికీ తెలియనివ్వనని మాట తీసుకొంటాడు. గుణ సుందరి ఇంటినుండి వెళ్ళిన కొద్ది కాలానికి ఆమె తండ్రి కాలు గాయాలు పెద్దవై అధిక బాధ పడుతుంటాడు. కూతుళ్ళు అతడికి సేవచేయక సూటి పోటి మాటలని తమ భర్తల సహాయంతో తండ్రి కాలు తీసేయించే ప్రయత్నం చేస్తారు. కూతుళ్ళ గురించి నిజం తెలిసి భయపడిన రాజు మంత్రికి చెప్పి తన కాలు బాగుచేయించే మార్గం చూడమంటాడు. అంజనం ద్వారా మహేంద్రమణి తెచ్చి తాకిస్తే తగ్గుతుందని చెపుతారు పండితులు. అది తెచ్చిన వారికి తనరాజ్యాన్ని ఇస్తానని ప్రకటించమంటాడు రాజు.

తండ్రి అనారోగ్యం గురించి తెలిసిన గుణ సుందరి తన భర్తను ఆ మణిని తీసుకొచ్చి తన తండ్రి అనారోగ్యాన్ని తొలగించమని వేడుకొంటుంది. వీరశేనుడు ముసలి రూపునే మణి కోసం బయలుదేరుతాడు. ఇటు రాజు పెద్ద అళ్ళుళ్ళు కూడా బయలుదేరుతారు. వీరశేనుడు మణి సాధనలో తన తెలివితేటలతో దారిలో ఎదురైన ఆపదలను గట్టెక్కి, అక్కడ ఉన్న యక్షిణులను గెలిచి తన తోడళ్ళుళ్ళతో పాటు అక్కడకు చేరుకొని అక్కడ యక్షిణి ద్వారా మంత్రం నేర్చి మహేంద్రమణిని సాధిస్తాడు. అందరూ తిరిగి వస్తుండగా ఒక రాత్రి నిద్రిస్తున్న వీరశేనుడి తలపై మోది అతడిని బావిలో తోసి మణి తీసుకొని పారొపోతారు అతడి తోడళ్ళుళ్ళు ఇద్దరూ. ఇక్కడ పల్లెనుండి గుణసుందరి రాజును వెళ్ళి చూసేందుకు వెళ్ళగా ఆమె అక్కలు ఆమెను అవమానించి ఆమె భర్త గురించి అవమానంగా మాట్లాడటంతో ఆవేశంలో నిజం చెప్పేస్తుంది. అక్కడ బావిలో వీరశేనుడు బల్లూకంగా మారిపోతాడు. మణిని తీసుకొని వచ్చిన రాజు అళ్ళుళ్ళు దాని మంత్రం గాయాలను మాన్పలేకపోతారు. బల్లూకంగా మారిన వీరశేనుడు జనాలు తరుముతుంటే పల్లెకు వస్తాడు. గుణ జనాలనుండి కాపాడి తన ఇంటికి తీసుకుపోయి క్షమించమని ఆవేశంలో చెప్పేసానని ఏడుస్తూ దేవిని ప్రార్ధిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు ఆమె ప్రార్ధనకు మెచ్చి కోయరూపాలలో ఆమెను, బల్లూకాన్ని వెంటబెట్టుకొని రాజు దగ్గరకు వచ్చి వీరశేనునికి పూర్వరూపం ఇచ్చి అతడి గురించి అందరికీ వివరిమ్చి గుణసుందరి పాతివ్రత్యకారణంగానే తాము మెచ్చి భువికి వచ్చామని చెప్పి నిజరూపాలతో అందరికీ ధర్శనమిచ్చి అదృశ్యమవుతారు.

పాటలు

 1. అదియే ఎదురై వచ్చేదాకా పదరా ముందుకు పడిపోదాం – రేలంగి, పసుమర్తి కృష్ణమూర్తి
 2. అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా మమ్ము మా పల్లే పాలింపవమ్మా – ఘంటసాల వెంకటేశ్వరరావు
 3. ఈ వనిలో కోయిలనై కోయిల పాడే గానమునై గానము కోరే – టి.జి. కమలాదేవి
 4. ఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా అపరాధములన్ని మరచి – పి. లీల
 5. ఒహరే ఒహరే ఓ ఒహరే బ్రహ్మదేవుడా నీవెంత వంతకారివయ్యా – కస్తూరి శివరావు
 6. ఓ మాతా రావా నా మొరవినవా నీవు వినా దక్కెవరే ఓ రాజరాజేశ్వరి – పి. లీల
 7. ఓ ఓహొ చారుశీల లేజవరాలా సొగసు భళా – వి. శివరాం
 8. కలకలా ఆ కోకిలేమో పలుకరించె వింటివా – కె.మాలతి, శాంతకుమారి
 9. కల్పగమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతిని – పి.లీల
 10. చల్లని దొరవోయ్ ఓ చందమామా – కె.మాలతి, శాంతకుమారి
 11. చిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటే – కస్తూరి శివరావు, పి.లీల
 12. శ్రీతులసి ప్రియతులసి జయమునీయవే జయమునీయవే – పి. లీల
 13. హరహరహర ఢమరుక నాదం …తెలుసుకోండయా – టి.జి. కమలాదేవి బృందం

చిత్ర వీడియో లింక్ – https://www.youtube.com/watch?v=cATigzVffH0

శ్రీగౌరి మాహత్యం (Sri Gowri Mahatyam)

Gaurimahatyam


శ్రీగౌరి మాహత్యం మహీ పిక్చర్స్ వారి అద్భుత చిత్రం.

1956 లో తీసిన ఈ చిత్రానికి డి.యోగానంద్ దర్శకుడు. ఓగిరాల రామచంద్రరావు, టి.వి.రాజు సంగీతం అందించగా మల్లాది రామకృష్ణ శాస్త్రి పాటలను రాసారు. చిత్ర నిర్మాత ఎస్.శేషాచలం

నటీనటులు
* నందమూరి తారక రామారావు
* శ్రీరంజని (జూనియర్)
* కాంతారావు
* సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
* రేలంగి వెంకట్రామయ్య
* సూర్యకాంతం
* వల్లూరి బాలకృష్ణ

చిత్ర కథ

ఒకానొక రాజ్య మహారాజుకు ఇద్దరు భార్యలు, పెద్ద భార్య కుమార్తె గౌరి(శ్రీరంజని). ఆమె తన తల్లితో కలసి రోజూ పార్వతిదేవిని పూజిస్తూ ఉంటుంది. చిన్న రాణి వీరిపై కక్ష పెంచుకొని పెద్దరాణికి లడ్డూలలో విషం పెట్టి చంపుతుంది. తరువాత గౌరికి యుక్తవయసు వచ్చు వరకూ ఆగి ఆమెకు పిచ్చివాడినో వెర్రివాడినో వెతికి తెమ్మని తంటాలు(రేలంగి)కు పురమాయిస్తుంది. అతడికి వీరుడైన బాలకుమారుడు కనిపిస్తాడు.  అతడికి గౌరి చిత్రం చూపి కథ చెప్పగా అతడిని వెర్రివాడిగా  
నటించి గౌరిని వివాహమాడుతానని చెప్తాడు. అలా వారి రాజ్యం చేరి నాటకమాడి చిన్నరాణి ద్వారా వివాహం పూర్తి చేయిస్తారు.

కైలాసాన పార్వతి తన భక్తురాలి వివాహం చూసి ఆమెను ఆశీర్వదించు సమయాన ఈశ్వరుడు ఆమెను వారించి బాల వీరుని గురించిన నిజం తెలియచేస్తాడు

మాహారాజు సత్యవృతుడు పుత్ర సంతానానికికై పరమేశ్వరునికై తపస్సు చేస్తాడు. కాని ఎప్పటికీ ప్రత్యక్షమవని శివునిపై కోపం వచ్చి ఎదుట కల శివలింగాన్ని ప్రక్కన కల కుండతో కొడతాడు. దానిపై పరమేశ్వరుడు ‘ నీకు పుత్రుని ప్రసాదిస్తాను కాని అతడు కుండ ఎన్ని ముక్కలైనదో అన్ని సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడని చెప్తాడు.

దీనిపై పార్వతి నా భక్తురాలికి పతి వియోగం కలుగనీయను అని చెప్తుంది. శివుడు తన కర్తవ్యం తాను నెరవేర్చాలని పట్టుబడతాడు. వీరి ఇరువురి ప్రతిజ్నల మద్య గౌరి, బాలవీరుల కథ ఏమయిందనేది ముగింపు

పాటలు
*అగర్వ సర్వమంగళా కళాకదంబమంజరి (శ్లోకం) – ఘంటసాల – రచన: జగద్గురు ఆదిశంకరాచార్య
* అమ్మలేకపోతే అన్నానికే బాధ అయ్యలేకపోతే అప్పుబాధ (పద్యం) – ఘంటసాల – రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
* అమ్మా ఏమమ్మా అమృతములో హాలాహలము చిలికినదెవరమ్మా – పి.లీల
* అమ్మా నీవు కన్నవారింట అల్లారుముద్దుగ వెలగే తీరు – పి.లీల
* ఆకుమారి అమయక అమల హృదయ చలిపిడుగువంటి (పద్యం) – ఘంటసాల – రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
* టాటోకు టక టోంకు టక్కులాడ .. చిక్కుల గుర్రం – ఘంటసాల – రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
* తారా రేరాజు సరాగమాడ సంబరపడేను అంబరసీమ – పి.లీల
* దీవించు మా తల్లి శివుని అర్ధాంగి మహిమలు గల తల్లి – పి.లీల బృందం
* నాగేంద్ర హరాయ త్రిలోచనాయ (శ్లోకం) – ఘంటసాల – రచన: జగద్గురు ఆదిశంకరాచార్య
* నేనే ఒకటి రెండు సార్లువివోహోత్సాహము (పద్యం) – సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
* నీవక్కడ నేనిక్కడ ఈ చిక్కుతీరేదెక్కడో ఒక్కరుంటే ఓరుగాలి – ఘంటసాల – రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
* నిను ఎడబాయరా జత విడిపోనురా ఇక నావాడవే రారా రాజ – పి.సుశీల
* నీవున్ నేనున్ మామఅల్లుడగటల్ నిక్కంబే (పద్యం) – సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
* బలే బలే గారడి బల్ పసందు గారడి చెల్లుకు చెల్లు గారడి – ఘంటసాల – రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
* మహిం మూలాధారే కమసి మణిపురే (శ్లోకం) – ఘంటసాల *
* రావయ్యోవ్ ఏమయ్యోవ్ రావయో ఓ పెళ్ళికొడుకా రవ్వంటి ఓ – ఘంటసాల – రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
* వల్లోన చిక్కిందిరా పిట్టా వదలిపెడ్తే మనది కాదురా – పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి బృందం
* శివమనోహరి సేవలుగొనవే దేవీ దీవనలీవే – పి. లీల, ఘంటసాల – రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
* సజ్జన చిత్తానందకరీ సంస్క­­ృత పాపవౌ (శ్లోకం) – ఘంటసాల – రచన: జగద్గురు ఆదిశంకరాచార్య
* హృదిమరుతమాకాశముపరి మనోపిభూమధ్యే (శ్లోకం) – ఘంటసాల

చిత్రం వీడియో కోసం  – https://www.youtube.com/watch?v=UMjWr0-jyhk